Relationship: టీనేజ్ దాటుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి?

First Published | Aug 28, 2023, 12:57 PM IST

 Relationship: టీనేజ్ దాటిన పిల్లలు అప్పుడప్పుడే తల్లిదండ్రుల చాటు నుంచి బయటికి వస్తూ ఉంటారు. వాళ్లకి ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. ఆ అందాన్ని అందుకోవాలని తొందరలో చాలా మంది చాలా పొరపాట్లు చేస్తారు. అయితే టీనేజ్ దాటిన పిల్లలు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.
 

సాధారణంగా పిల్లలు 18, 19 ఏళ్ళు దాటుకున్నాయి అంటే అప్పుడప్పుడే తల్లిదండ్రులు చేతి నుండి బయటికి వచ్చి సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం, ఫ్రెండ్స్ తో కలిపి బయట ప్రపంచాన్ని చూడటం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే అనుకోకుండా తెలిసి తెలియని తనంతో చాలా తప్పులు చేస్తూ ఉంటారు.
 

తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే లోపు  భవిష్యత్తు నాశనం అయిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వయసులో మీరు చేయకూడని పనులు ఏంటో తెలుసుకోండి. ముఖ్యంగా చదువవు మీద శ్రద్ధని తగ్గించకండి. లైఫ్ ని ఎంజాయ్ చేయండి.
 


 ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని నిర్లక్ష్యం చేయకండి. అలాగే కాలేజీలకని చెప్పి ఇంట్లో బయలుదేరి షికారులకి బయటికి వెళ్ళకండి. అలా ఇంట్లో చెప్పకుండా వెళ్లి బయటకు వెళ్లి ప్రమాదాల పాలైన వాళ్ళు ఎందరో ఉన్నారు.
 

అది తల్లిదండ్రులకి తీరని కడుపు కోతని మిగులుస్తుందని గమనించండి. అలాగే పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకండి. డబ్బులు ఉన్నప్పుడు మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మీకు డబ్బులు అవసరం అయినప్పుడు ఒక్కరు కూడా ఉండరని గ్రహించండి.
 

 కాబట్టి ఈ వయసు నుంచే డబ్బుని  ఎలా ఉపయోగించాలో ఒక అవగాహన కి రండి. అలాగే ఈ వయసులో ప్రేమలో సహజం. ప్రేమించ వద్దని చెప్పటం లేదు కానీ అందులో మెచ్యూరిటీని ప్రదర్శించండి. నచ్చిందని ప్రేమించడం, చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ లు చెప్పుకోవటంచేయకండి. ఇలాంటివన్నీ పిల్ల చేస్టలని, జీవితం ఆశామాషి వ్యవహారం కాదని గుర్తుంచుకోండి.

జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేసినప్పటికీ కెరీర్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ కెరియర్ కి తప్పనిసరిగా ఇవ్వండి. అలాగే సరదాగా మొదలుపెట్టిన చెడు వ్యవహారాలు అలవాటుగా మారుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సిగరెట్టు, మందు జోలికి పోకండి. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కెరియర్ మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తు మీదే అని గ్రహించండి.

Latest Videos

click me!