Relationship: అబ్బాయిలు.. పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా మీకోసమే?

First Published | Aug 5, 2023, 1:50 PM IST

Relationship: పెళ్లి అనేసరికి అబ్బాయిలు గాల్లో తేలిపోతూ ఉంటారు. సంతోషమే కానీ పెళ్లి ముందు జీవితం వేరు పెళ్లి తర్వాత జీవితం వేరు. అందుకే పెళ్లికి ముందే పెళ్లి తర్వాత జీవితం గురించి తెలుసుకోమంటున్నారు నిపుణులు అదేంటో చూద్దాం.
 

 పెళ్లి అనేది జీవితంలోని ముఖ్యమైన ఘట్టం. జీవితంలో పెను మార్పులు తీసుకువచ్చే సంఘటన పెళ్లి. పెళ్లికి ముందు బ్యాచిలర్ లైఫ్ వేరు వెళ్లి అయిన తర్వాత ఒక భర్తగా జీవితం వేరు. అందుకే పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుసుకొని ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు పెళ్లికి సిద్ధపడితే మంచిది అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.
 

 ఇంతకీ అబ్బాయిలు తెలుసుకోవలసిన విషయాలు ఏమిటో చూద్దాం. బ్యాచిలర్ లైఫ్ లో మనం ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏమి తిన్నా బాధ్యత లేకుండా ప్రవర్తించినా మనల్ని అడిగే వారు ఎవరు ఉండరు కానీ పెళ్లి తర్వాత అలా కుదరదు. భర్త అనేది ఒక బాధ్యతాయుతమైన పోస్ట్.
 

Latest Videos


దానిని సమర్థవంతంగా నిర్వహించాలంటే పూర్తి బాధ్యతని కలిగి ఉండాలి. సమయానికి ఇంటికి రావడం, ఇల్లాలికి తగిన సహాయం చేయడం వంటివి చేయాలి. పెళ్ళికి ముందు ఉన్నట్లే బాధ్యత రహితంగా ఉంటాను అంటే మీరు మీ భార్యకి ద్రోహం చేసినట్లే కాబట్టి  బాధ్యత నేర్చుకోండి.

అలాగే పెళ్లి తర్వాత విచ్చలవిడితనాన్ని కట్టి పెట్టండి. పెళ్లికి ముందు మన శాలరీని ఎలా ఖర్చుపెట్టినా పెద్దగా పట్టించుకోవక్కర్లేదు కానీ పెళ్లి అయిన తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా మీ భార్యతో కూర్చుని ఆలోచించి ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టాలి.
 

పెళ్లి లైఫ్ లో ఫ్యూచర్ ప్లానింగ్ చాలా అవసరం. అలాగే ఇంట్లో ఇల్లాలికి తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అలా చేయటం వలన మీతో పాటు మీ భార్య కూడా ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఇద్దరు కూర్చుని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.
 

అలాగే ఒక భర్తగా మీ భార్యకి సంబంధించిన విషయాలకు కూడా బాధ్యత మీరే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పెళ్లి తర్వాత జీవితం ఇలా ఉంటుంది అని తెలుసుకుని దానికి మానసికంగా సిద్ధపడిన తర్వాతే పెళ్లికి సిద్ధం అవ్వమంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.

click me!