గతంతో పోల్చుకుంటే నేటి మగవారి ఆలోచనా విధానం మారిపోయింది. అబ్బాయిలు ఇంటి బయట పనిచేసే అమ్మాయిలను ఇష్టపడతారు. వారిని ప్రోత్సహిస్తారు. ఉన్నత హోదాలో ఉండి సాధించాలనే లక్ష్యం ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం గర్వంగా భావించే అబ్బాయిలు మనకున్నారు. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే.. ఆమెతో ఎక్కువ కాలం సంతోషంగా జీవించాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలా సార్లు ఈ ఉత్సాహం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇల్లు, పిల్లలను చూసుకునే వారు లేరన్న భయం, లేదా భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు, సంబంధం చెడిపోతుంది. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి తెలుసుకోవలసిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...