Marriage: ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. కచ్చితంగా ప్రతీ ఒక్కరూ వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. అయితే తక్కువ ఆదాయం ఉన్న వారికి పెళ్లి కష్టంగా మారుతుందని అధ్యయనం చెబుతోంది.
వివాహం తక్కువ ఆదాయం ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయమై ప్రముఖ చార్టెట్ అకౌంట్, ఐఎస్‌బీ గోల్డ్ మెడలిస్ట్ సార్థక్ అహుజా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ప్రపంచంతో పాటు, మన దేశంలో కూడా తక్కువ లేదా మధ్య తరగతి ఉద్యోగాల్లో ఉన్నవారిని చూస్తే… వాళ్లకు పెళ్లి చేసుకోవడం కష్టమవుతోంది. అమెరికాలో 1970లో కాలేజీ చదవని 30–50 ఏళ్ల పురుషుల్లో 90% పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 50%కి తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మహిళల్లో కూడా కనిపిస్తోంది.
25
ధనికులు, చదువుకున్నవారిలో మాత్రం పెద్ద మార్పు లేదు
పేదలు, మధ్య తరగతిలో పెళ్లి తగ్గుతున్నా… డబ్బున్నవారి, మంచి విద్య ఉన్నవారి పెళ్లి రేట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వారు ఆర్థికంగా బలంగా ఉండటంతో కుటుంబాన్ని నడపగలగడం ఒక కారణంగా చెబుతున్నారు.
35
పెళ్లి చేస్తే ఆదాయం పెరుగుతుంది
రిసెర్చ్ చెబుతున్నది ఏమిటంటే… పెళ్లి చేసుకున్న వాళ్ల ఆదాయం, ఒంటరిగా ఉండేవారితో పోలిస్తే 10–50% వరకు ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేయడం లేదా బాధ్యతలు పెరగడం కారణంగా ఇతర ఆదాయ మార్గాల వైపు అన్వేషిస్తున్నారు. అలాగే ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంపాదన కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
ఎక్కువ చదువుకున్నవారు, పెద్దవాళ్లు “పెళ్లి పాత పద్ధతి… అందరికీ అవసరం లేదు” అంటారు. కానీ తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలా చెప్పే ఆలోచనలను లగ్జరీ బెలీఫ్స్ అంటారు.
55
ఒంటరిగా ఉండడమే నష్టం
కొంతమందికి పెళ్లి అంటే భయం. పెళ్లి ఖర్చులు, సపోర్టివ్ పార్ట్నర్ దొరకదనే భయం ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉంటారు. కానీ ఇలా ఉండటం వల్ల పెళ్లితో వచ్చే ఆర్థిక లాభాలు, స్థిరమైన జీవితం వంటి ప్రయోజనాలు కోల్పోతున్నారు.