Relationship: పెద్దలు కుదిర్చిన పెళ్ళే ఉత్తమం.. ప్రేమ పెళ్లిలో లోపాలివే?

First Published | Jul 8, 2023, 1:15 PM IST

Relationship: ప్రేమ పెళ్లి గొప్పదా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి గొప్పదా అనేది నేటి జనరేషన్ కి ఒక పెద్ద సమస్య. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లే ఉత్తమం అంటున్నారు అనుభవజ్ఞులు. అందుకు గల కారణాలేంటో చూద్దాం.
 

 ఒకప్పుడు ప్రేమ పెళ్లి అనే మాటే వినిపించేది కాదు ఒకవేళ ఎవరైనా పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళని వెలివేయటం ఇలాంటి శిక్షలు విధించేవారు కానీ కాలంతో పాటు మారిన జనరేషన్ ఇప్పుడు ప్రేమ పెళ్లికే తమ ఓటు వేస్తుంది. కానీ ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి బెటర్ అని మీకు తెలుసా..
 

నిజమేనండి ఈ ఆధునిక యుగంలో కూడా ఎక్కువ సక్సెస్ అవుతున్న పెళ్లిళ్లు పెద్దలు కుదుర్చునవి మాత్రమే ప్రేమ పెళ్లిళ్లు చాలా మటుకు మధ్యలోనే విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి. అందుకు గల కారణాలు ఏమిటో చూద్దాం.
 

Latest Videos


 ప్రస్తుతం లవ్ మ్యారేజ్ కే చాలామంది పెద్దపీట వేస్తున్నారు. ఎందుకంటే వివాహం అనేది ఒక సంబంధం పునాదిని నిర్మించే ఒక ముఖ్యమైన అంశం కాబట్టి లవ్ లో ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకోవడం, అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది.
 

కాబట్టి లవ్ మ్యారేజ్ బెటర్ అని ఒక అభిప్రాయానికి వచ్చేసారు నేటి జనరేషన్ లో చాలామంది అయితే లవ్ లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలో అన్ని మంచి లక్షణాలే  కనిపిస్తాయి. ప్రేమ మైకం ఎదుటి వ్యక్తిలో లోపాలను కూడా చంపేస్తుంది.
 

కానీ ఒకసారి పెళ్లి అయిన తర్వాత అదే లోపం వాళ్ళ.. జీవితాలని చిన్నాభిన్నం చేసేస్తుంది. అలాంటి వాళ్ళకి పెద్దలు సపోర్టు ఉంటే పర్వాలేదు లేదంటే ఆ ఇద్దరి జీవితం ప్రమాదంలో పడిపోయినట్లే. అదే అరేంజ్డ్ మ్యారేజ్ లో అయితే ఒక్క మనిషి గురించే కాకుండా మొత్తం కుటుంబం గురించి ఆరా తీస్తారు.
 

ఒకవేళ సంసారంలో ఎలాంటి.. అపార్ధాలు చోటు చేసుకున్నా పెద్దవాళ్లు దగ్గరుండి సర్దుబాటు చేస్తారు. వాళ్ళ అనుభవాలతో మన జీవితానికి పూలబాట వేస్తారు. అలా అని అరేంజ్డ్ మ్యారేజ్ లో ఫెయిల్యూర్స్ లేవా అంటే ఉన్నాయి కానీ చాలా తక్కువ శాతం.

click me!