ఎలాగా సహజీవనం జరుగుతున్నది కదా అని చెప్పి కొన్ని రోజులకి ఒకరి మీద ఒకరికి బోర్ కొట్టేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ ఆఫీసులో, లేకపోతే వాళ్లు పని చేస్తూనే దగ్గర ఇంకెవరైనా నచ్చడం లాంటివి జరుగుతాయి. ఇది తెలిసి భాగస్వామికి కోపం రావడం ఇలాగ గొడవలుకు కూడా కారణం అవుతుంది. పొజిసివినెస్ లాంటివి పెరిగిపోయి మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగిపోతుంది.