పెళ్లి అనేది యువతి యువకుల జీవితాలలో అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి కోసం యువతీ యువకులు చాలా కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కలలని నిజం చేసుకునే ఓపిక ఉండటం లేదు నేటి తరానికి. అనుకున్నది అవ్వకపోతే వెంటనే విడాకులకి సిద్ధమైపోతున్నారు. కానీ కాస్త ఓపిక పట్టి కొంచెం చెరువు చూపిస్తే బంగారు కాపురం మీ అరచేతుల్లో ఉంటుంది.
మీ భర్త మీ కొంగున ఉంటాడు. సాధారణంగా భార్యాభర్తల ఇద్దరి మధ్యన గొడవ జరిగినప్పుడు మరొక ఆలోచన లేకుండా పుట్టింటికి బయలుదేరిపోతుంది అమ్మాయి. కానీ అలా చేయకండి పెళ్లి తర్వాత అది కేవలం బంధువుల ఇల్లు మాత్రమే.
మీ కాపురం ఎఫెక్ట్ మీ అన్నదమ్ముల కాపురాల మీద కూడా పడే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీ ఇంట్లోనే ఉంటూ మీ సమస్యని పరిష్కరించుకోండి. కోపం మీద ఉండి మీ మీద అరుస్తున్న భర్తని మీరు ఏమీ మాట్లాడకుండా ఒక హాగ్ ఇచ్చి చూడండి అతనిలోని మార్పు కి మీరే షాక్ అవుతారు.
ఎంత త్వరగా చల్లబడిపోతాడంటే గొడవ జరుగుతున్న విషయం కూడా మరిచిపోతాడు. అంతేకానీ అతనితోపాటు మీరు అరిస్తే గొడవ మరింత పెరుగుతుంది. అలాగే భర్తతో గొడవ పడిన తర్వాత సెక్స్ కి దూరంగా ఉంచకండి. అతనిలోని శాడిజాన్ని బయటికి తీసినట్లు అవుతుంది.
మీకు ఇష్టం లేకపోయినా మీ భర్తని మీకొంగున కట్టుకోవటానికి అదే మంచి సమయం అని గ్రహించండి. ఆ సమయంలో భర్త ఏం చెప్పినా వింటాడు. అలాగే భర్త కూడా విచక్షణ లేకుండా భార్య మీద అరవకుండా భార్య భుజం మీద చేయి వేసి కష్టసుఖాలు అడిగి చూడండి.
ఆ చిన్న సందర్భానికే ఆమె ఎంతో ఆనందపడుతుంది. మరొక ముఖ్య విషయం మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యని మీ బంధువులకి గాని మీ ఫ్రెండ్స్ కి గాని అస్సలు చెప్పకండి. మీ సమస్యని మీరే పరిష్కరించుకొని భవిష్యత్తుని బంగారు మయం చేసుకోండి.