Relationships: ఒక్కసారి కలిశాడు.. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు

Published : Mar 05, 2026, 02:40 PM IST

Relationships: ఒక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన వ్యక్తిగత అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంది. జీవితంలో ఒక్కసారి కలిసిన వ్యక్తి.. మూడు వారాల్లో తన లైఫ్ ని ఎంతగా మార్చాడో ఆమె చెబుతోంది. అందులో ఉన్న మంచిని మాత్రమే మనం తీసుకుందాం. 

PREV
14
అతనితో నాకు కుదరలేదు

నా వయసు 24 ఏళ్లు. అందరి అమ్మాయిల్లా చాలా ఆశలతో గుండె నిండిపోయిన వయసు. సాఫ్ట్ వేర్ డెవలపర్‌గా ఎక్కువ జీతమే అందుకుంటున్నా. నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు. జీవితం హాయిగా సాగిపోతున్న దశ. నాకు స్మోకింగ్ వాసనే పడదు. స్మోక్ చేసేవాళ్లను చూస్తే చాలు కోపం వచ్చేస్తుంది. పూర్తిగా జీవితం మన కంట్రోల్ లోనే ఉంచుకోవాలి అనుకునే టైపు నేను. చదువు, పని, ఫ్యూచర్... ఇంతే నా ఫోకస్. కానీ మూడేళ్లుగా మాత్రం ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. నిజంగా ప్రేమలో ఉన్నానా? అంటే అది చెప్పలేను. ప్రేమ అనే ఒక పేరు పెట్టుకుని జీవిస్తున్నాననిపించింది. అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్. అతను వేరే దేశంలో ఉండేవాడు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చేవాడు. ఒక్కసారి మాత్రమే కలిసి మాట్లాడుకునే వాళ్ళం. కానీ నాకు ఎప్పటి నుంచో ఆ ప్రేమను వదులుకోవాలనిపించేది. అదే విషయాన్ని అతనికి చెప్పేదాన్ని. అతను మాత్రం వినేవాడు కాదు పూర్తిగా నా ప్రేమలో మునిగిపోయాడు. నేను మాత్రం చాలా ఫ్రీగా ఉండే మనిషిని. అతనికి ఎన్నోసార్లు ఈ రిలేషన్షిప్ నాతో నడవదని చెప్పాను. నేను అంతగా అటాచ్ అవ్వలేదని కూడా చెప్పాను. అయినా కూడా అతను వినలేదు. చివరికి ఒకరోజు తెగించి బ్రేకప్ చెప్పేసాను. అతడు బాధతో నా జీవితంలో నుంచి బయటకు వెళ్లిపోయాడు. కానీ ఒక్క మాట కూడా నన్ను ఏమీ అనలేదు. అతని బాధను చూశాక కూడా నా మనసేమీ కరగలేదు.

24
ప్రేమలో పడిపోయా

కొన్ని రోజులు ఖాళీగా గడిచిపోయాయి. అప్పుడే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు పూర్తిగా నా టైపే అనిపించింది. తన ప్రపంచం, హాబీస్, ట్రావెల్స్, ఫ్రెండ్స్.. అంతే అంతకుమించి పెద్దగా ఏదీ పట్టించుకోడు, ఏది సీరియస్ గా తీసుకోడు. అతను మాట్లాడుతూ ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉండేది. అలా మాటలు వినాలనిపించేది. అయితే మొదటి రోజే అతను నాకు ఒక విషయం చెప్పాడు. నాకు సీరియస్ రిలేషన్షిప్‌లు పనికిరావు.. నేను చాలా క్యాజువల్, ఎప్పుడైనా నాకు నచ్చకపోతే ఆ రోజే నీ కంటి ముందు నుంచి మాయమైపోతాను అన్నాడు. ఆ మాట విన్నాక కూడా నేను ఇంకా అతనితోనే రిలేషన్షిప్ లో ఉన్నాను. ఆ రోజే దూరంగా వెళ్లి ఉంటే మనసుకు బాధ తగ్గేదేమో... ‘పరవాలేదు ఎన్ని రోజులు నువ్వు నాతో ఉంటే అన్ని రోజులు ఉండొచ్చు కదా’ అని అడిగాను. మొదటి వారం ఒక కలలా గడిచిపోయింది. సినిమాలోలాగా ఎంత అందంగా ఉన్నాయో ఆ రోజులు. రోజంతా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. రాత్రి కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్లే వాళ్.ళం కాఫీ షాప్స్ మా కబుర్లతోనే నిండిపోయేది. ఇవన్నీ చాలా స్పెషల్ గా అనిపించేవి. అతని మాట్లాడే విధానంలో నేను మునిగిపోయాను.

34
కనిపించకుండా వెళ్లిపోయాడు

రెండవ వారానికి వచ్చాము... కొంచెం కొంచెం మార్పులు కనిపించాయి. గుడ్ మార్నింగ్ మెసేజెస్ పెట్టడం మానేశాడు. కాల్స్ చేయడం కూడా తగ్గించాడు. ఇంతకుముందు అతని మాటల్లో కనిపించే స్వీట్ నెస్ కాస్త తగ్గింది. అది నేను గమనించాను. కానీ అప్పటికే నేను అతనికి పూర్తిగా లొంగిపోయాను. అతని కోసమే ఆలోచించేదాన్ని. అతను బాగుండాలని కోరుకునేదాన్ని. ఎన్నోసార్లు అతనికి నా చేతులతో తినిపించేదాన్ని. బయట అయ్యే ఖర్చులు కూడా నేనే భరించేదాన్ని. ఇక మూడో వారం వచ్చేసింది... ఆ వ్యక్తి పూర్తిగా మాయం అయిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేది. మెసేజెస్ కి రిప్లై ఉండేది కాదు. అప్పుడప్పుడు మాత్రం కాల్స్ రింగ్ అయ్యేవి. ఒకరోజు నా కాల్స్ కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అతనికి ఎడతెరిపి లేకుండా ఒక 20 సార్లు ఫోన్ చేశాను. దాంతో అతను ఫోన్ తీసి మాట్లాడాడు. అప్పుడు అతను చెప్పిన మాట ఒక్కటే ‘నేను నీ ప్రేమను హ్యాండిల్ చేయలేను. నువ్వు ఎక్కువగా రిలేషన్ షిప్ లో ఉన్నావు. నేను చాలా ఫ్రీ స్పిరిట్ అని ముందే చెప్పాను’ అని గుడ్ బై చెప్పేసాడు. మూడు వారాల్లోనే నా ప్రేమకథ ముగిసిపోయింది.

44
నా జీవితం నా కంట్రోల్ లో

మొదటి రోజు చాలా అవమానంగా, కోపంగా అనిపించేది. రెండు రోజులు గడిచాక నా పరిస్థితి నాకే చెడుగా కనిపించింది. నన్ను వాడుకున్నాడా? నేను ఎందుకు తెలివితో ప్రవర్తించలేదు అనిపించింది. మరికొన్ని రోజులు గందరగోళంగా అనిపించాయి. అవమానం, కోపం, నిరాశ అన్నీ కలిసిపోయాయి. చివరికి నా మనసుకు అర్థమైంది.. నాకేం కావాలో కూడా తెలుసుకున్నాను. నాకు కావాల్సింది ప్రశాంతత. అతడు నాతో అటాచ్ అవ్వలేకపోయాడని అర్థమైంది. నేను నా మొదటి ప్రేమికుడికి ఎలా అటాచ్ అవ్వలేదో.. ఇతను కూడా అలాగే అవ్వలేదు. నేను నా మొదటి ప్రేమలో ఎంత ఊపిరి సలపనట్టు ఫీలయ్యానో.. ఇతడు కూడా నా ప్రేమలో అలాగే ఫీలయ్యాడని అర్థం చేసుకున్నాను. ఒక మనిషితో అటాచ్ అవ్వకుండా జీవించడం చాలా కష్టం. అది నేను మూడేళ్లు భరించాను. కాబట్టి నా రెండో ప్రేమికుడి బాధ కూడా నాకు అర్థమైంది. ఆ ఘటన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. కొత్త కొత్త పనులు ప్రయత్నించేదాన్ని. జీవితంలో చేయని పనులు చేసేదాన్ని. కొన్ని రోజులు రాత్రులు ఒంటరిగా నేనే డ్రైవింగ్ కు వెళ్ళేదాన్ని. నా మనసులోని గడబిడ తగ్గడం మొదలైంది. కానీ ఒకటే ప్రశ్న నా మదిలో ఉండిపోయింది. ఎప్పటికప్పుడు నేను చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని అనుకునేదాన్ని. కానీ ఒక వ్యక్తి మూడు వారాల్లో నన్ను ఇంతలా పిచ్చిదాన్ని ఎలా చేయగలిగాడు? ఇదేనేమో ప్రేమ. మొదటి ప్రేమికుడు కూడా నా విషయంలో ఇంతగానే బాధపడి ఉంటాడు.. ఇంతే గందరగోళానికి గురై ఉంటాడు అనిపించింది. ఈ రెండు అనుభవాల వల్ల నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను.. జీవితంలోకి ఎవరైనా రావచ్చు, వెళ్లొచ్చు.. కానీ మనల్ని మనం మాత్రం కోల్పోకూడదు. మనల్ని మనమే నిలబెట్టుకోవాలి. అదే మన బాధ్యత.

Read more Photos on
click me!

Recommended Stories