ప్రేమలో పడటం ఈజీనే. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. మొదట్టో అన్ని బాగుంటాయి. టైం గడిచే కొద్దీ.. ఎమోషన్స్, ఎక్స్‌పెక్టేషన్స్ మారతాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సైకాలజీ ప్రకారం ప్రేమలో విజయం పొందాలంటే తెలుసుకోవాల్సిన 5 విషయాల గురించి చూద్దాం.
ప్రేమ అనేది ఎమోషన్ మాత్రమే కాదు.. అది మనసు, మెదడు, ప్రవర్తన అన్ని కలిసి పనిచేసే ఒక సైకాలజికల్ ప్రక్రియ. మొదట్లో ప్రేమ బంధం హ్యాపీగా, ఉత్సాహంగా అనిపించడం సహజం. కాలం గడిచే కొద్దీ ఈ బంధంలో మార్పు కనిపించవచ్చు. అప్పుడు చీలికలు మొదలయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా బంధం నిలబడాలంటే కొన్ని నిజాలను అర్థం చేసుకోవడం అవసరం అని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. ప్రేమలో ఉన్నవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.
26
ఆకర్షణ వేరు, అటాచ్మెంట్ వేరు
సైకాలజీ ప్రకారం ఆకర్షణ, అటాచ్మెంట్ రెండూ ఒకటి కావు. ప్రేమలో పడిన మొదట్లో డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు మెదడులో అధికంగా విడుదలవుతాయి. అందువల్ల ఎదుటివారు పరిపూర్ణంగా కనిపిస్తారు. కానీ ఈ దశ శాశ్వతం కాదు. కొంతకాలం తర్వాత సంబంధం నిజ జీవితానికి వస్తుంది. అప్పుడు చిన్న చిన్న లోపాలు కనిపించడం సహజం. నిపుణుల ప్రకారం ఈ దశలోనే నిజమైన అనుబంధం మొదలవుతుంది. కాబట్టి మొదటి ఉత్సాహం తగ్గిందని, ప్రేమ తగ్గిపోయిందని భావించడం తప్పు.
36
కమ్యూనికేషన్ ముఖ్యం
సైకాలజీ ప్రకారం కమ్యూనికేషన్ ప్రేమకు పునాది. చాలామంది ప్రేమ లేకపోవడం వల్ల కాదు, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల విడిపోతుంటారు. భావాలు, బాధలు, అంచనాలను స్పష్టంగా చెప్పకపోతే అపోహలు పెరుగుతాయి. అలాగే ఎదుటివారి మాట వినడం కూడా అంతే ముఖ్యం. ఫీలింగ్స్ ని క్లియర్ గా బయటకు చెప్పడం సంబంధాన్ని హెల్తీగా ఉంచుతుంది. మౌనం చాలా సార్లు సమస్యలను పెంచుతుంది.
సైకాలజీ ప్రకారం ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎదుటి వ్యక్తి పూర్తిగా తనతోనే ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రతి వ్యక్తికి తన స్పేస్, ఆసక్తులు, స్నేహితులు అవసరం. సైకాలజీ ప్రకారం హద్దులు లేని సంబంధాలు కొంత కాలానికి ఒత్తిడిని కలిగిస్తాయి. అతిగా ఆధారపడటం లేదా నియంత్రించడం ప్రేమను బలహీనపరుస్తాయి.
56
ఎమోషన్స్ పై దృష్టి..
ప్రేమలో అసురక్షిత భావాలు సహజం, కానీ అవి సంబంధాన్ని శాసించకూడదు. అసూయ, భయం, కోల్పోతాననే ఆందోళన వంటివి సహజ భావాలు. కానీ అవి ఎక్కువైతే అనుమానాలు, గొడవలు పెరుగుతాయి. నిపుణుల ప్రకారం స్వీయ గౌరవం బలంగా ఉన్నప్పుడు సంబంధం స్థిరంగా ఉంటుంది. కాబట్టి ప్రేమలో ఉన్నవారు ముందుగా తమ ఎమోషన్స్ పై దృష్టి పెట్టాలి.
66
సమస్య వచ్చినప్పుడు..
సైకాలజీ ప్రకారం ప్రేమ బంధంలో ఇద్దరూ కలిసి ఎదగాలి. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ వాటిని ఎలా పరిష్కరించుకుంటామనేదే ముఖ్యం. సమస్య వచ్చినప్పుడు దూరంగా పారిపోవడం కాకుండా మాట్లాడి పరిష్కరించుకోవడం సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఒకరినొకరు మార్చడానికి ప్రయత్నించడం కంటే, అంగీకరించడం, ప్రోత్సహించడం ఉత్తమ మార్గం.