Relationship: ఈ చాణక్య నీతి విన్నారా.. మీ భార్య బాధ్యత మీదేనట తెలుసా?

First Published | Aug 1, 2023, 1:48 PM IST

Relationship: పెళ్లి చేసుకుని తనతో పాటు ఇంటికి వచ్చిన భార్యని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత ఆ భర్తదే. మీ భార్య తన కష్టసుఖాలు మీతో మాత్రమే పంచుకోగలదని గ్రహించండి. అందుకే భర్తలకి ఉండవలసిన లక్షణాలని చాణిక్యుడు ఏమని చెప్పాడో చూద్దాం.
 

భార్యాభర్తల బంధం ఆనందంగా కొనసాగాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు. అయితే అందులో ముఖ్యంగా ఒక భర్త తన భార్యని ఎలా చూసుకోవాలో, ఆమె విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పాడు అవేంటో ఇప్పుడు చూద్దాం.
 

 సాధారణంగా భర్తకి మగవాడిని అనే అహంకారం ఉంటుంది. అది పది మంది ముందు చూపించుకోవాలి అనుకుంటాడు. అందుకోసం పదే పదే పది మంది ముందు భార్యని చులకన చేయటానికి ఇష్టపడతాడు. అది ఒక భర్తగా చేయకూడని పని.
 


 నిజంగానే మీ భార్య ఒకవేళ తప్పు చేసినట్లయితే అది పది మంది ముందు కాకుండా  ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆమె చేసిన తప్పుని ఆమెకి అర్థమయ్యేలాగా చెప్పండి. అలాగే కష్టాలు గాని ఇబ్బందులు గాని వచ్చినప్పుడు..
 

 ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా మీ భార్య అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వండి. ఆమెతో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గురించి చర్చించండి. ఆమె సలహా మీరు పాటించిన పాటించకపోయినా మీరు ఆమెకి విలువ ఇచ్చారనే ఒక తృప్తి ఆమెకి ఉంటుంది.
 

భార్యని పదిమందిలోకి తీసుకు వెళ్ళినప్పుడు ఆమెని ముందుగా మీరు గౌరవించండి. అప్పుడే మిగిలిన వాళ్లు మీ భార్యని గౌరవిస్తారని గుర్తుంచుకోండి. అలాగే మీ తల్లిదండ్రుల ముందుగానే మీ అక్క చెల్లెల ముందుగానే మీ భార్యని అవమానించేలాగా మాట్లాడితే వారి ముందు మీ భార్యకి ఎంత అవమానమో ఒకసారి గుర్తించండి.
 

మీరు లేనప్పుడు మీ భార్యని మరొక నాలుగు మాటలు అనే అవకాశం మీ బంధువులకి ఇచ్చినవారవుతారు. కాబట్టి అలాంటి అవకాశం వాళ్లకి ఇవ్వకండి. అలాగే మీ భార్య ఏ విధమైన తప్పు చేసినా దానిని వారి పుట్టింటి కి చెప్పకుండా వీలైనంత మటుకు మీరే సర్దుబాటు చేయడానికి ప్రయత్నించండి.

Latest Videos

click me!