Relationship: భార్యాభర్తలు పొరపాటున కూడా ఈ మాటలు అనుకోవద్దు.. ఇవి బంధానికే ఎసరు తెస్తాయి

relationships: భార్యాభర్తలు అన్నాక గొడవలు, గిల్లికజ్జాలు సహజం. గొడవపడ్డా కొన్నాళ్లైతే మళ్లీ సర్దుకుంటారు. ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉంటారు. కానీ ఈ గొడవ సమయంలో వాడే కొన్ని పదాలు వారిని తీవ్రంగా హర్ట్ చేస్తుంటాయి. ఇద్దరి మధ్య పూడ్చుకోలేనంత అగాధం నెలకొల్పుతాయి. ఇంతకీ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి పదాలు వాడొద్దు అంటే.. 

Husband and wife should not utter these words in telugu
నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశా

ఇది చాలా పెద్ద మాట. పొరపాటున కూడా ఈ మాట మీ భార్య లేదా భర్తతో అనొద్దు. ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. జీవితాంతం కలిసి ఉండాాల్సిన వ్యక్తి నుంచి ఆ మాట వస్తే ఎవరూ తట్టుకోలేరు. నాతో కలిసి ఉండటం తనకి ఇష్టం లేదు అని అనుకుంటారు. ఇది మీపై ప్రేమను తగ్గించడమే కాదు.. మీ మధ్య దూరం పెంచుతుంది.

తల్లిదండ్రులపై నోరు పారేసుకోవడం

మీ భార్య లేదా భర్తని ఒక మాట అన్నా తట్టుకుంటారుగానీ..  వాళ్ల తల్లిదండ్రులను అంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ‘నీకూ మీ పేరెంట్స్ లాగే తెలివి తక్కువ’, ‘వాళ్లలా ఏ పనీ చేతకాదు’ ఇలాంటి మాటల్ని జీవితాంతం మనసులో పెట్టుకుంటారు. ఇలా పోల్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదు. 


నువ్వంటే ఇష్టం లేదు

ఒక్కసారి ఈ మాట మీ నోటి నుంచి వెళ్లిందా.. ఇక అంతే. ప్రేమ లేని చోట కలిసి ఉండటం ఎందుకు అనే ఆలోచన మొదలవుతుంది. ఇవి మొత్తం బంధానికే ఎసరు తెస్తాయి. ఒకవేళ పొరపాటున ఆ మాట అంటే.. సారీ చెప్పి సర్దుబాటులో చేసుకోవాలి. మనం ఏ మాట చెబితే ఎదుటివాళ్ల నుంచీ అదే వస్తుంది. 

ఇది నా పని కాదు

భార్యాభర్తలన్నాక అన్ని పనులూ కలిసిమెలిసి చేసుకోవాలి. ఒకరికొకరు తోడుండాలి. అలా కాకుండా ఈ పని నాది కాదు.. నువ్వే చేయాలి.. అనే మాటలు మీ నోటి నుంచి వచ్చాయా? అవతలి వారూ అలాగే స్పందిస్తారు. బరువు, బాధ్యతలు పంచుకోవడం మొదలవుతుంది. నాదీ, నాదీ అనే తేడాలు మొదలవుతాయి. ఇవి బంధాన్ని బీటలు వారేలా చేస్తాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!