Modi wife yashodaben మోదీ భార్యతో ఎందుకు కలిసి ఉండరు? దాని వెనక ఉన్న కారణమేంటి?

మోదీ భార్య యశోదాబెన్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఆయన రాజకీయ జీవితం గురించి అందరికీ తెలుసు. చాలా కిందిస్థాయి నుంచి వచ్చి అత్యున్నత స్థానానికి చేరారు. పదేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ప్రధాని హోదాలో పరిపాలిస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్దిమందికే తెలుసు. ఆయనకు పెళ్లై, భార్యతో వేరుగా ఉంటున్నారు. దాని వెనక ఉన్న రహస్యమేంటో ఇప్పటికీ తెలియదు. ఈ విషయం గురించి మోదీ అన్నయ్య సోంభాయ్ తెలియజేశారు.

Why modi lives apart from his wife His age at marriage and their relationship in telugu
మోదీ వ్యక్తిగత జీవితం గురించి

మోదీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మూడుసార్లు నామినేషన్ పత్రంలో ‘సింగిల్’ అనే చెప్పారు. కానీ పదకొండేళ్ల కిందట మాత్రం ఎంపీగా పోటీ చేసే సమయంలో భార్య పేరు చెప్పారు. అప్పట్నుంచి ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరిలో ఉత్సుకత మొదలైంది. 

Why modi lives apart from his wife His age at marriage and their relationship in telugu
మోదీ పెళ్లి గురించి

2014 ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు మోదీ తన పెళ్లి గురించి చెప్పారు. ఆయన భార్య పేరు యశోదాబెన్. ఇప్పటికీ ఆమె మోదీ భార్యే కానీ వాళ్లు కలిసి ఉండటం లేదు. 


యశోదాబెన్ ఫోటో వైరల్

ఒక ఎన్నికల సమయంలో యశోదాబెన్ మోదీ వ్యతిరేక పోస్టర్ పట్టుకున్న ఫోటో వైరల్ అయ్యింది. అది నకిలీదని తర్వాత తేలింది. ఎన్నో ఏళ్లుగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. అలాగని శత్రుత్వం కూడా లేదు.  మొదట్లో మోదీ తన భార్య గురించి చెప్పలేదు, కానీ తర్వాత ఆమె తన భార్య అని ఒప్పుకున్నారు. 

ఎందుకు విడిపోయారంటే..

మోదీ అన్నయ్య సోంభాయ్ చెప్పిన వివరాల ప్రకారం.. మోదీ టీనేజీలో ఉండగానే తల్లిదండ్రులు బలవంతంగా యశోదాబెన్ తో పెళ్లి చేశారు. అది తనకు ఇష్టం లేకపోవడంతో వాళ్లిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. దాంతో మోదీ ఇంట్లోంచి వెళ్లిపోయారు. తర్వాత యశోద తన పుట్టింటికి చేరింది. ఆపై వాళ్లిద్దరూ శాశ్వతంగా దూరమయ్యారు. 

మోదీ రమతా యోగి

మోదీ తనని తాను రమతా యోగిగా చెప్పుకుంటారు. ఆయన ఆత్మకథ ప్రకారం, ఆయనకి ఇప్పుడు భార్యతో సంబంధం లేదు. భార్యకి దూరమయ్యాక స్వామి వివేకానంద బోధనల పట్ల విపరీతంగా ఆకర్షణకు గురయ్యారు మోదీ. దాంతో తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేయాలని భావించారు. జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చారు. 

యశోదాబెన్ ఓటు

కాగితాల మీద ఇప్పటికీ యశోదాబెన్ మోదీ భార్య అయినా, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి యశోదాబెన్‌ని ఎవరికి ఓటేశారని అడిగితే, ప్రతి ఏటా ఓటేస్తాను, ఈ ఏడాది కూడా వేశానని చెప్పారు తప్ప మోదీపై అభిమానంగా మాట్లాడలేదు.

Latest Videos

vuukle one pixel image
click me!