sex addiction
అలాంటప్పుడు భాగస్వామి శరీర భాగాలను కొరకడం చేస్తారు. ఇలా కొరికినప్పుడు ఏర్పడిన గుర్తులను లవ్ బైట్స్ (Love bites) అంటారు. లవ్ బైట్స్ శరీరంపై కొన్ని గుర్తులుగా మిగిలిపోతాయి. ఈ గుర్తులు ఇబ్బందిపెడతాయి. వీటిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శృంగారం తారస్థాయికి చేరినప్పుడు చాలామంది ఆలుమగలు కాస్త మొరటుగా (Rudely) వ్యవహరించడం చేస్తారు. ఈ కారణంగా భాగస్వామి శరీర భాగాలను చుంబించడం, దంతాలతో కొరకడం (Biting with teeth) చేస్తారు. ఇలా కొరికిన ప్రదేశంలో చర్మం కమిలిపోయి వాటి తాలూకా గుర్తులు అలానే కొన్ని రోజులపాటు ఉండిపోతాయి.
కొరికిన చర్మం కింద సూక్ష్మ రక్తనాళాలు (Blood vessels) పగిలి రక్తం బయటకు వచ్చి లవ్ బైట్స్ గాయాలుగా మారుతాయి. ఈ లవ్ బైట్స్ ని వైద్య పరిభాషలో హికీస్ (Hickies) అంటారు. లవ్ బైట్స్ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మెడ, ముఖంపై ఏర్పడినప్పుడు కాస్త ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. రసవత్తరమైన శృంగారాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు లవ్ బైట్స్ గురించి పెద్దగా పట్టించుకోరు.
Sex-related
కానీ వీటి తాలూకు గుర్తులు ఉదయం ఇంట్లో అందరి కంటపడితే మాత్రం ఇబ్బందిగా (Embarrassing) ఉంటుంది. అయితే లవ్ బైట్స్ ను తక్షణమే తగ్గించుకోవడం కుదరదు కాబట్టి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే వాటి తీవ్రత తగ్గుతుంది. లవ్ బైట్స్ ఏర్పడిన చోట ఐస్ ముక్కలతో కాపురం పెడితే మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై ఐస్ ముక్కను నేరుగా పెట్టకుండా ఐస్ ప్యాక్ (Ice pack) సహాయంతో 20నిమిషాల పాటు కాపురం పెట్టుకోవడం మంచిది.
SEX
అదే లవ్ బైట్స్ ఏర్పడిన చోట ఎక్కువగా వాపు, నొప్పి ఉంటే ఐబూఫ్రొఫెన్ టాబ్లెట్ (Ibuprofen tablet) ను వాడవచ్చు. అలాగే లవ్ బైట్స్ ఏర్పడిన ప్రదేశంలో విటమిన్ కె ఆయింట్మెంట్ (Vitamin K Ointment) ను రాసుకోవచ్చు. విటమిన్ కె గాయాలను మానడానికి సహాయపడుతుంది. విటమిన్ కె సమృద్ధిగా దొరికే మాంసం, పాల ఉత్పత్తులు, సోయాబీన్, గుడ్లు, బ్లూబెర్రీ, ద్రాక్ష, అంజూర, పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలను తీసుకోవాలి.
దీంతో చర్మానికి విటమిన్ కె సమృద్ధిగా లభించి లవ్ బైట్స్ తొందరగా తగ్గుతాయి. గాయాలు త్వరగా మానడానికి, చర్మం రక్త కణాలు ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలో కొల్లాజెన్ (Collagen) అనే ప్రోటీన్ ఉత్పత్తి జరగాలి. శరీరంలో కొలాజెన్ తగినంతగా ఉత్పత్తి కావడానికి విటమిన్ సి (Vitamin C) అవసరమవుతుంది. కనుక లవ్ బైట్స్ ఏర్పడిన ప్రదేశంలో విటమిన్ సి క్రీమును కూడ రాస్తే త్వరగా మానుతాయి.
విటమిన్ సి అధికంగా లభించే ఆహారపదార్థాలను తీసుకోవాలి. గాయాలను, వాపులను, నొప్పులను తగ్గించడానికి ఆర్నికా మొక్క నుండి తయారు చేసిన ఔషధం సహాయపడుతుంది. ఈ మందును హోమియోలో (Homoeo) ఎక్కువగా వాడుతారు. కనుక లవ్ బైట్స్ ఏర్పడిన ప్రదేశంలో ఆర్నికా జెల్ (Arnica gel) కానీ, ఆయింట్‌మెంట్ కానీ రాస్తే మంచి ఫలితం ఉంటుంది.