శృంగారం తర్వాత.. స్త్రీలు కోరుకునేది ఇదేనట..!

First Published | Mar 5, 2022, 3:21 PM IST

మనసు, శరీరం ఉత్సాహంగా ఉండే ఆ సమయంలో భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం మీరనుకున్నదానికంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయట. 

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. వారు కోరుకున్నట్లుగా.. కలయికను ఆస్వాదించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే.. కలయిక తర్వాత.. పురుషులు పని అయిపోయినట్లుగా ప్రవర్తిస్తారట. కానీ..  స్త్రీలు మాత్రం.. ఆ శృంగారం కన్నా కూడా.. ఆ తర్వాతే కొన్నింటిని ఎక్కువగా కోరుకుంటారట.

శృంగారం మీ బంధాన్ని మరింత బలపరచాలంటే మీ భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకోవాలి. దీనికోసం శృంగారం పూర్తి కాగానే అటు తిరిగి పడుకోకుండా కాసేపు మనసువిప్పి మాట్లాడుకోండి. 


శృంగారం ఓ జంటకు సంబంధించిన ఆంతరంగిక విషయం. ఇది శరీరానికే కాదు మనసుకూ హాయిని కలిగిస్తుంది. ఆ సమయంలో శరీరంలో రిలీజయ్యే హార్మోన్లు శరీరాన్ని తేలిక చేస్తుంది. మనసును దూదిపింజలా మార్చేస్తుంది. మనసు, శరీరం ఉత్సాహంగా ఉండే ఆ సమయంలో భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం మీరనుకున్నదానికంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయట. 

శృంగారం తరువాత కామ్ గా ఉండడాన్ని స్త్రీలు ఇష్టపడరట. ఇది అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. తమ భాగస్వామితో భావోద్వేగపూరితమైన సంభాషణలు చేయాలని స్త్రీలు కోరుకుంటారట. ఇది ఇటీవలి పరిశోధనల్లో తేలింది

శృంగారం తరువాత స్త్రీలలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందట. దీనివల్ల పురుషులకంటే స్త్రీలు ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉంటారట. అందుకే మనసులోని మాటలు చెప్పుకోవడానికి ఇష్టపడతారట. 

పురుషుల్లో అత్యధిక స్థాయిలో ఉంటే టెస్టోస్టిరాన్ హార్మోన్లు, ఆక్సిటోసిన్ ను అణిచివేస్తాయి. దీనివల్ల శృంగారం తరువాత మగాళ్లు మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరట. 

చక్కటి శృంగారం తరువాత మంచి సంభాషణ తమను భాగస్వామికి మరింత దగ్గర చేస్తుందని స్త్రీలు నమ్ముతారు. అందుకే వారి ఆశలు, కోరికలు.. ఒత్తిళ్లను పంచుకోవలనుకుంటారు. దీనిద్వారా ఇద్దరి మధ్య అందమైన క్షణాలు మరింత అద్భుతంగా మారతాయని ఆకాక్షిస్తారు. 

శృంగారం తరువాత కాసేపు మనసువిప్పి మాట్లాడుకేనే జంటల్లోనే ఎక్కువ లైంగిక తృప్తి పొందుతారని అధ్యయనాల్లో తేలింది.  శృంగారం అనేది ఓ అద్భుతమైన, అనిర్వచనీయమైన భావన. అందుకే స్త్రీలు అంత అద్భుతమైన భావన పొందిన తరువాత మాట్లాడడానికి ఇష్టపతారట. అయితే దీనికి భిన్నంగా భావించేవారూ ఉన్నారు. అది వారి వారి భావోద్వేగాలకు సంబంధించి ఉంటుందట. 

Latest Videos

click me!