ఎవరు గొప్ప..? దంపతుల మధ్య ఇలాంటి సమస్య మొదలౌతే..?

First Published | Mar 5, 2022, 10:44 AM IST

దంపతుల మధ్య.. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి..? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి  చూద్దాం..

మన సమాజంలో ప్రతి విషయాన్ని పవర్ శాసిస్తూ ఉంటుంది. ఏదైనా సంబంధంలోనూ ఇదే పవర్  శాసిస్తూ ఉంటుంది. ఇక భారతీయ వివాహాంలోనూ.. కుల, లింగ, సామాజిక స్థితి, విద్య, శారీరక బలం, ఆర్థిక స్వాతంత్ర్యం వంటివి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి.  ముఖ్యంగా.. భారతీయ వివాహాల్లో పురుషులు ఎక్కువ పవర్ ఉన్నవారిగా నమ్ముతూ వస్తున్నారు.

ఒకప్పుడు ప్రతి విషయంలోనూ మహిళలపై వివక్ష ఎక్కువగా ఉండేది. అయితే.. ఇప్పుడిప్పుడే అది మారుతూ వస్తోంది. మహిళలు కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.  ఇక.. సంపాదన విషయంలోనూ పురుషులతో సమానంగా  ముందుంటారు. అయితే.. ఇప్పటికీ భార్య భర్తల మధ్య ఎవరు గొప్ప అనే అంశం ఎక్కువగా తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos


దంపతుల మధ్య.. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి..? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి  చూద్దాం..

కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ క్రమంలో వారి సంబంధాలు మరింత పెళుసుగా మారాయి. సాంప్రదాయకంగా, తక్కువ శక్తి కారణంగా స్త్రీ జీవితంలో  చాలా సార్లు రాజీ పడవలసి వస్తుంది. ఇప్పుడు, చాలా మంది మహిళలు అలా చేయడానికి ఇష్టపడటం లేదు. మేము ఎందుకు రాజీ పడాలి అని ప్రశ్నిస్తున్నారు.  అలా అని , పురుషులు కూడా మారడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో.. వారు తమ జీవితాలన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. 

దంపతులు ప్రతి విషయంలో నేనే గొప్ప అనే అహాన్ని పక్కన పెట్టేయాలట. ఇద్దరూ ఆనందంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని  జీవించాలి అనుకుంటే.. బేరీజులు వేసుకోకూడదు. జీవిత భాగస్వామిని ఏ విషయంలోనూ తక్కువ చేయకూడు. ఇద్దరూ తమ పనులను సమానంగా పూర్తి చేసుకోవాలి. మానసికంగా.. నేనే గొప్ప అనే మార్పును అలవాటు చేసుకోవాలి. 

దంపతులు ప్రతి విషయంలో నేనే గొప్ప అనే అహాన్ని పక్కన పెట్టేయాలట. ఇద్దరూ ఆనందంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని  జీవించాలి అనుకుంటే.. బేరీజులు వేసుకోకూడదు. జీవిత భాగస్వామిని ఏ విషయంలోనూ తక్కువ చేయకూడు. ఇద్దరూ తమ పనులను సమానంగా పూర్తి చేసుకోవాలి. మానసికంగా.. నేనే గొప్ప అనే మార్పును అలవాటు చేసుకోవాలి. 

భార్యలను సమానంగా చూడాలని భర్తలకు చెప్పాం కదా.. అని స్త్రీలు.. పొగరుగా ప్రవర్తించకూడదు. భర్త అణిగిమణిగి ఉన్నాడు కదా అని..  ప్రతి విషయంలోనూ బెదిరంచకూడదు. అలా చేయడం వల్ల  పురుషుల్లో అభద్రతా భావం పెరిగిపోతుంది. కాబట్టి.. అలా చేయకూడదు.  ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి.

movie

భార్యాభర్తలిద్దరూ కుటుంబం కోసం ఉమ్మడి లక్ష్యాలను గౌరవించాలి. వ్యక్తిగత కలలను కూడా గౌరవించాలి. ఇది ఆర్థిక విషయాల కోసం భర్తపై 100% భారాన్ని తగ్గిస్తుంది. సంరక్షణ కోసం లేదా ఇతర సందర్భాల్లో స్త్రీపై 100% భారాన్ని తగ్గిస్తుంది.

దంపతుల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. వన్ వే కమ్యూనికేషన్  అస్సలు మంచిది కాదు. ఏ విషయాన్ని అయినా.. మీ పార్ట్ నర్ తో చెప్పుకోగలిగేలా ఉండాలి. ఇప్పుడు.. ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం పెరుగుతాయి... దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది.   కాబట్టి... ఇలా ఉంటే.. ఇద్దరి మధ్య ఇగో సమస్యలు రాకుండా ఉంటాయి.ve.

click me!