ఒక బంధంలోని ఘాడత మిమ్మల్ని మీరు కోల్పోయేలాగా చేయవచ్చు. ఒకవేళ మీరు అలా ఉండకపోతే ఆ బంధం విచ్ఛిన్నమవుతుందని మీరు భయపడుతూ ఉండవచ్చు. అయితే అలాంటి బంధం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవాల్సిన అవసరం లేదు.
ఒక బంధంలో మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే భాగస్వామి మీద మితిమీరిన వ్యామోహం పెంచుకోకండి, అలాగే విపరీతమైన నమ్మకం కూడా పెంచుకోకండి. పూర్తిగా భాగస్వామి మీద ఆధారపడి ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి.
మీ భాగస్వామి ఏదైనా మీ దగ్గర నుంచి ఆశించినప్పుడు మీకు వీలైతే నే దానిని ఇవ్వటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఆమెకి సహాయం చేసే స్థితిలో లేకపోతే ఆ విషయం ఖచ్చితంగా చెప్పండి అంతేకానీ లేనిపోని మొహమాటానికి పోతే మీరే ఇబ్బందుల్లో పడతారు.
అలాగే బంధంలో ఉన్న భాగస్వామిని కోల్పోతానేమో అనే భయం కూడా మిమ్మల్ని మీకు కాకుండా చేస్తుంది. అలాంటి విచారాన్ని కూడా పక్కన పెట్టండి. మీరు కావాలి అనుకునే భాగస్వామి ఎప్పటికీ మీలో ఉండే మిమ్మల్ని కోల్పోనివ్వదు. అలాగే భాగస్వామి వ్యామోహంలో పడి మీ నిర్ణయాలని మీ భాగస్వామికి వదిలేయకండి.
ఒక బంధంలో మీ పరిమితులు సరిహద్దులు మరియు ఒప్పందాన్ని తెలుసుకోవడం కంటే విలువైనది మరొకటి ఉండదు. అదే సమయంలో మీకంటూ కొంత సమయాన్ని వెచ్చించుకోండి. మీ పూర్తి సమయాన్ని మీ భాగస్వామి కోసం వెయిట్ చేస్తే చివరికి చులకన అయిపోయేది మీరే అని గుర్తించండి. అలాగే మనసు మాట వినండి.
భాగస్వామి మీద వ్యామోహంతో మనం ఏ పని చేసినా మనకి ఆ నిమిషానికి బాగానే అనిపిస్తుంది కానీ నువ్వు చేస్తున్నది తప్పు అంటూ మన మనసు మాత్రం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. కాస్త మనస్సాక్షి మాట కూడా వినండి. అప్పుడు ఎలాంటి బంధంలో వున్నా మీ విలువ మీకు ఉంటుంది.