టమాటాల నుంచి పెరుగు వరకు.. వీటిని తిన్నారంటే ఆ సెక్స్ సమస్యలేం ఉండవ్

First Published | Aug 4, 2023, 10:38 AM IST

లైంగిక అవయవాలు, పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ఇవి మీకు పోషణను అందించడమే కాకుండా మీ లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.  
 

మన శరీరంలోని ప్రతి అవయవం మాదిరిగానే లైంగిక అవయవాలు, పునరుత్పత్తి వ్యవస్థకు కూడా సరైన పోషణ చాలలా అవసరం. అయితే ఖనిజాలు, విటమిన్లున్న కొన్ని ఆహారాలు లైంగిక అవయాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి  లైంగిక ఆరోగ్యానికి చాలా చాలా అవసరం కూడా. 
 

న్యూట్రియంట్ జర్నల్ ప్రకారం.. కొన్ని ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి నివారణ లేదా వాటి పురోగతి అవకాశాలను తగ్గిస్తాయి. అలాగే శరీరంలో రక్త ప్రసరణను పెంచుతాయి. అంతేకాదు ఇవి మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. కొన్ని వారాలుగా మీకు సెక్స్ లో పొల్గొనాలనిపించకపోతే ఇది సెక్స్ డ్రైవ్ తగ్గడానికి సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. మరి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


అత్తిపండు

నిపుణుల ప్రకారం.. అత్తి పండ్లను తింటే లిబిడో పెరుగుతుంది. జర్నల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ ప్రకారం.. అత్తి పండ్లు సంతానోత్పత్తిని పెంచుతాయి. ఇది అద్భుతమైన కామోద్దీపనగా కూడా పనిచేస్తుంది. ఈ పండులో కరిగే, కరగని ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పునరుత్పత్తి అవయవాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. తాజా అత్తి పండ్లతో పాటుగా రాత్రి నీటిలో నానబెట్టిన అత్తి పండ్లను ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తినొచ్చు.
 

curd

పెరుగు

జర్నల్ ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్ ప్రకారం.. పెరుగు ప్రీబయోటిక్. ఇది యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా పీహెచ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడతాయి. యోని ఆరోగ్యం కోసం ఒక చిన్న కప్పు పెరుగును తినండి. దీన్ని భోజనంలో కూడా తినొచ్చు. 
 

బాదం

జర్నల్ ఆఫ్ సెక్సువల్ హెల్త్ ప్రకారం.. బాదం లైంగిక ఉద్దీపనగా పనిచేస్తుంది. దీనిని మన దేశంలో లిబిడో, లైంగిక కోరికలు, సంతానోత్పత్తిని పెంచడానికి శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. లైంగిక ఆరోగ్యం, పునరుత్పత్తికి అవసరమైన పోషకాలు, జింక్, సెలీనియం, విటమిన్ ఇ వంటి అనేక సూక్ష్మ ఖనిజాలు బాదం పప్పుల్లో ఉంటాయి. జింక్ లిబిడో, లైంగిక కోరికలను పెంచడానికి సహాయపడుతుంది. లైంగిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి నీటిలో నానబెట్టిన గుప్పెడు బాదం పప్పులను చిరుతిండిగా తినండి. 

Tomatoes

టమాటాలు

జర్నల్ ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్ ప్రకారం.. టమాటాలు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. టమాటాల్లో ఉండే లైకోపీన్ కణం, డీఎన్ఏను దెబ్బతీసే విష పదార్థాలతో పోరాడుతుంది. అలాగే వీర్యకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. లైకోపీన్ రక్త ప్రసరణను పెంచి మహిళల్లో లైంగిక వాంఛను పెంచుతుంది. దీనిని మీ రోజువారీ సలాడ్ గా లేదా రాత్రి భోజనంలో ఒక గిన్నె టమాటా సూప్ ను కూడా చేర్చొచ్చు.
 

అల్లం 

ఇది ఫుడ్ ను టేస్టీగా చేయడమే కాదు మీ రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచడానికి సహాయపడతాయి. అల్లంలో జింజెరోల్ సమ్మేళనాలు మహిళల్లో  నాణ్యత కలిగిన గర్భాశయ శ్లేష్మం ఉత్పత్తికి సహాయపడతాయి. 
 

పుచ్చకాయ

పుచ్చకాయలో సిట్రులైన్ అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది లిబిడోను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంగస్తంభన లోపాన్ని పోగొడుతుది. అంతేకాదు ఇది వయాగ్రా మాదిరిగా సిట్రులైన్ రక్త నాళాలను విడదీయడానికి సహాయపడుతుంది. 
 

click me!