Relations: ఇలాంటి స్నేహితులతో కాస్త దూరంగా ఉండాల్సిందే..!

First Published Aug 4, 2022, 11:21 AM IST

కొందరు స్నేహితులతో అన్ని సమయాల్లో మనతో ఉన్నట్లే ఉంటారు. కానీ... మనకు కావాల్సిన సమయాల్లో ఒక్కోసారి మనతో ఉండరు. అలాంటి వారికి దూరంగా ఉండాలట.

Image: Getty Images

మనందరికీ స్నేహితులు ఉంటారు. అందులో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కొందరు మామూలు ఫ్రెండ్స్ ఉంటారు. మనం మన స్నేహితులతో చాలా సరదాగా ఉంటాం. వారితో అన్ని విషయాలు పంచుకుంటాం. అయితే.. కొందరు మనతో మంచిగా ఉంటూనే... మనపై విషం చిమ్ముతూ ఉంటారు. అలాంటి స్నేహితులకు మనం ఎప్పుడూ దూరంగా ఉండటమే మంచిది. అయితే... అలాంటి స్నేహితులను మనం ఎలా గుర్తించాలో ఓసారి చూద్దాం...

Image: Getty Images

1.కొందరు స్నేహితులతో అన్ని సమయాల్లో మనతో ఉన్నట్లే ఉంటారు. కానీ... మనకు కావాల్సిన సమయాల్లో ఒక్కోసారి మనతో ఉండరు. అలాంటి వారికి దూరంగా ఉండాలట.
 

Image: Getty Images

2. కొందరు మనతో స్నేహంగా ఉన్నట్లే ఉంటారు. కానీ మనం ఎలా ఉన్నాం అనే దానిపై ప్రతి నిమిషం కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఆ కామెంట్లు.. మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. అలా మిమ్మల్ని బాధ పెట్టే కామెంట్స్ చేసే స్నేహితులు నిజమైన స్నేహితులు కావచ్చు.
 

Image: Getty Images

3.కొందరు స్నేహితులు... తమ సమస్యలన్నింటినీ మీ మీద వేస్తున్నారు అంటే వారికి కాస్త దూరంగా ఉండాల్సిందే.  ఎందుకంటే.. వారు ప్రతిసారీ.. తమ సమస్యలన్నింటినీ మీరే పరిష్కరించాలంటూ మీ మీద వేసి... మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా దూరంగా ఉండాలి.
 

Image: Getty Images

4.కొందరు స్నేహితులు.. ప్రతి నిమిషం మీ విషయంలో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక రకంగా మీ పక్కనే ఉంటూ.. మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా దూరంగా ఉండాలి.
 

Image: Getty Images

5.ప్రతి ఒక్కరూ.. తమ స్నేహితులు తమతో చాలా నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే.. ఆ నిజాయితీ మరీ దారుణంగా ఉండకూడదు. నిజాయితీ పేరు చెప్పి.. మిమ్మల్ని  బాధపెట్టే మాటలు, చేష్టలు చేస్తున్నారు అంటే వారితో కాస్త దూరంగా ఉండాల్సిందే.

Image: Getty Images

6.మీ స్నేహితులు అందరిపై విమర్శలు చేస్తూ... మిమ్మల్ని కూడా ఇతరులపై అలానే విమర్శలు చేయాలి అని ప్రోత్సహిస్తున్నారు అంటే.. వారికి దూరంగా ఉండాల్సిందే.

7.మీ స్నేహితుల్లో ఎవరైనా నిత్యం ఇతరుల అటెన్షన్ కోరుకుంటూ.. మీ సమస్యలను పట్టించుకోకుండా.. కేవలం వారి అటెన్షన్ మాత్రమే కోరుకుంటున్నారు అంటే.. వారితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఫ్రెండ్ మీకు అసలు అవసరమే లేదు.

8.స్నేహితులు అంటే ఎలాంటి సీక్రెట్ అయినా షేర్ చేసుకునేవారు అని అర్థం. అలా కాకుండా.. మీ స్నేహితులు.. మీ వద్ద సీక్రెట్స్ దాచి పెడుతున్నారు అంటే కూడా వారితో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

click me!