ఇలా ఉండే వారిని చూస్తే.. ఎవరైనా ఆకర్షితులౌతారు..!

First Published | Aug 1, 2022, 3:12 PM IST

మనం రోజూ చూసేవారికంటే వారు చాలా భిన్నంగా కనిపిస్తారు, అందుకే వారి పట్ల మనం ఆకర్షితులమౌతూ ఉంటాం. అసలు.. మనం అలా ఒకరిని చూసి ఎందుకు ఆకర్షితులమౌతూ ఉంటాం. ఎలాంటి వారికి ఆకర్షితులమౌతూ ఉంటాం.

మీరు గమనించారో లేదో.. మనకు తెలీకుండానే మనం కొందరికీ ఎట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. వాళ్ల నుంచి చూపు తిప్పుకోలేకపోతూ ఉంటాం. వారి ఆకారం, చూపు, నడిచే విధానం.. ఇలా ప్రతి ఒక్కటీ మనకు నచ్చేస్తూ ఉంటుంది. మనం రోజూ చూసేవారికంటే వారు చాలా భిన్నంగా కనిపిస్తారు, అందుకే వారి పట్ల మనం ఆకర్షితులమౌతూ ఉంటాం. అసలు.. మనం అలా ఒకరిని చూసి ఎందుకు ఆకర్షితులమౌతూ ఉంటాం. ఎలాంటి వారికి ఆకర్షితులమౌతూ ఉంటాం. కారణాలేంటో ఓసారి చూద్దాం...
 

attract

ప్రజలు ఆత్మవిశ్వాసంతో నిలబడినప్పుడు అంటే నిటారుగా నిలబడి, వారి ఛాతీ పైకి, భుజాలు వెనుకకు ఉంచినప్పుడు.. వారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారట. ఇలా ఉండేవారి పట్ల ఎక్కువ మంది ఆకర్ణణకు గురౌతూ ఉంటారు.

Latest Videos


ఇక మనం ఎవరి పట్ల అయినా.. ఆకర్షితులమౌతున్నామంటే.. వారి నుంచి వచ్చే వాసన కూడా ఒక కారణమట. స్నానం లేకుండా.. నిత్యం చెమటతో ఉండేవారిని ఎవరూ మచ్చకపోవచ్చు. కానీ... శుభ్రత ప్రాధాన్యత ఇస్తూ.. మంచి సువాసనలు వెద జల్లే వారి పట్ల ప్రజలు ఎక్కువగా ఆకర్షితులౌతారు. 

ఆరోగ్యకరమైన నిద్రపోయిన వ్యక్తి కూడా ఇతరులకు ఆకర్షణీయంగా కనిపిస్తారట. రెండు రోజులు నిద్రపోని వారి వ్యక్తిని చూసినప్పుడు... మంచిగా ప్రశాంతంగా నిద్రపోయిన వ్యక్తిని చూసినప్పుడు.. ఇద్దరికీ తేడా స్పష్టంగా కనపడుతుంది. నిద్రపోయిన వ్యక్తి ముఖంలో అలసట కనిపించకుండా.. ఉత్సాహంగా.. తాజాగా కనిపిస్తారట. 

ఇక నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. ప్రశాంతంగా కనిపించేవారి పట్ల అందరూ ఆకర్షితులౌతూ ఉంటారట. ప్రతి సందర్భంలోనూ గొడవ చేసే వారితో పోలిస్తే, ప్రశాంతమైన మానసిక స్థితి కలిగిన వ్యక్తితో తొందరగా కనెక్ట్ అవుతారట. త్వరగా కోపం తెచ్చుకుని, ప్రశాంతతను కాపాడుకోలేని వారికి దూరంగా ఉండాలని ప్రజలు కోరుకోవచ్చు. ప్రశాతంగా ఉండేవారికి మాత్రం ఆకర్షితులౌతారట.

ఇక మనం ఎవరి పట్ల అయినా.. ఆకర్షితులమౌతున్నామంటే.. వారి నుంచి వచ్చే వాసన కూడా ఒక కారణమట. స్నానం లేకుండా.. నిత్యం చెమటతో ఉండేవారిని ఎవరూ మచ్చకపోవచ్చు. కానీ... శుభ్రత ప్రాధాన్యత ఇస్తూ.. మంచి సువాసనలు వెద జల్లే వారి పట్ల ప్రజలు ఎక్కువగా ఆకర్షితులౌతారు. 

ఇక తెలివిగల వారి పట్ల ప్రజలు తొందరగా ఆకర్షితులౌతూ ఉంటారు. అలా కాకుండా.. తెలివి తక్కువగా, పిచ్చిగా మాట్లాడే వారి పట్ల ఎవరూ తొందరగా ఆకర్షితులవ్వరట. చాలా మంది వ్యక్తులు తెలివితేటలు చాలా కావాల్సినవిగా భావిస్తారు. వ్యక్తులు ఒకరితో మేధోపరమైన తెలివైన సంభాషణలను నిర్వహించడం కోసం ఎదురు చూస్తారట.

మంచిగా మాట్లాడే వారి పట్ల కూడా ప్రజలు తొందరగా ఆకర్షితులౌతూ ఉంటారట. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేవారిని చూసి ఇతరులు వెంటనే ఆకర్షితులౌతూ ఉంటారట. మాట్లాడటం రాని వారిని చూస్తే.. పెద్దగా ఎవరూ మెచ్చకపోవచ్చు.
 

click me!