Relationship: అబ్బాయిలు ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే అమ్మాయిలు దూరం పెట్టడం ఖాయం?

First Published | Aug 29, 2023, 1:38 PM IST

 Relationship: ఈ రోజుల్లో అమ్మాయిలని పడేయాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు. అయితే అబ్బాయిలలో ఇలాంటి లక్షణాలు ఉంటే అమ్మాయిలకి అస్సలు నచ్చరట. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
 

అబ్బాయిలు.. అమ్మాయిల్ని పడేయాలంటే చాక్లెట్లు ఇచ్చి కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చినంత మాత్రాన పని జరగదు. ఒకవేళ తాత్కాలికంగా అమ్మాయిలు ఆ నిమిషానికి మీకు పడిపోయినంత మాత్రాన మీ పని పూర్తయినట్లు కాదు. నిజంగా అమ్మాయిలు మీకు ఫిదా అవ్వాలంటే మీలో ఉండే ఈ చెడు లక్షణాలని దూరం పెట్టండి.
 

అమ్మాయిలకి తగినంత గౌరవం ఇవ్వని అబ్బాయిలని అస్సలు నచ్చరట అమ్మాయిలు. అలాగే ఆడపిల్లల్ని చులకన చేస్తూ మాట్లాడే అబ్బాయిలని కూడా అమ్మాయిలు ఇష్టపడరు. ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోయి, అవతల వాళ్ళని కంగారు పెట్టేసే అబ్బాయిలని..
 


చూస్తే అమ్మాయిలు ఆమడ దూరం ఉంటారట. సమస్యని తెలివిగా పరిష్కరించుకునే అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడతారని ఒక సర్వేలో తేలింది. అలాగే ప్రతి దానికి నిందిస్తూ, తప్పు జరిగినప్పుడు నెపాన్ని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసే కన్నింగ్ మెంటాలిటీ ఉండే అబ్బాయిలని అమ్మాయిలు అసలు ఇష్టపడరు.
 

 అలాగే అమ్మాయిలు డబ్బు విషయంలో చాలా ప్లానింగ్ తో ఉంటారు. అబ్బాయిలు కూడా అలా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారు. మరీ జల్సాలు చేసే అబ్బాయిలని, మరీ పిసినారి గా ప్రవర్తించే అబ్బాయిలను కూడా అమ్మాయిలు దూరం పెడతారు.
 

అలాగే ఎదుటి వాళ్ళని చులకన చేస్తూ తను గురించి తను గొప్పలు చెప్పుకుంటూ డామినేటింగా ప్రవర్తించే అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇష్టపడరు. అమ్మాయిల ఇష్టానికి గౌరవం ఇవ్వకుండా తనకి నచ్చినట్లుగా చేస్తూ, ఎదుటి వాళ్ళు కూడా..
 

తనకు నచ్చినట్లుగా ఉండాలనుకొని ఆధిపత్యం చలాయించాలి అనుకుంటే అమ్మాయిలు మీకు దూరమైపోతారు జాగ్రత్త. అమ్మాయిల్ని మీ ప్రేమలో పడేయాలి, అమ్మాయిలని  మీ చుట్టూ తిప్పుకోవాలి అంటే మీలో ఈ లక్షణాలు ఏమైనా ఉంటే తక్షణమే మార్చుకోండి.

Latest Videos

click me!