Teenage Daughter టీనేజీ అమ్మాయితో నాన్న ఎలా ఉండాలి?

ప్రపంచంలో నాన్న-కూతురు అనుబంధం ప్రత్యేకమైంది. ప్రతి నాన్నకి తన కూతురు అంటే ప్రాణం అయితే.. ప్రతి కూతురు నాన్నని హీరోలా చూస్తుంది. ఈ ఇద్దిర అనుబంధం ఎప్పటికీ స్పెషలే అయినా కౌమారం మొదలైన దగ్గర నుంచి తన కూతురితో నాన్న ఒక స్నేహితుడిలా ఉండాలి. యుక్త వయసులో  లైంగిక విద్య, అబ్బాయిల గురించి అభిప్రాయం, భద్రతపై మాట్లాడటం చేస్తుండాలి. 

Fathers guide to teenage daughters relationship
ఒక్కసారిగా మార్పు

అప్పటిదాకా తన భుజాలపై ఎత్తుకొని తిరిగిన నాన్న కూతురు రజస్వల కాగానే దూరం పెడతారు. ప్రేమలో ఏ కొరతా లేకపోయినా తను పెద్దది అయిందనే ఉద్దేశంతో మునుపటిలా సాన్నిహిత్యం చూపించడు. ముందులా అన్ని విషయాలు ఫ్రీగా చెప్పలేడు.  ఇది కూతురుకు కష్టంగా ఉంటుంది. కూతురి మీద కోప్పడతారు. సీరియస్‌గా ఉంటారు. అలా ఉండు, ఇలా ఉండు అని అమ్మాయి మీద ఆంక్షలు పెడతాడు.

Fathers guide to teenage daughters relationship

అబ్బాయిల విషయంలో: చాలామంది నాన్నలు అబ్బాయిల గురించి నెగెటివ్ విషయాలు చెప్తారు. వాళ్ళతో క్లోజ్ గా ఉండొద్దు అంటారు. ప్రతి కూతురికి నాన్న హీరో. ఇలాంటివి కూతురి మనసులో భయాన్ని కలిగిస్తాయి.  అలా కాకుండా అబ్బాయిల గురించి, వాళ్ళ స్వభావం గురించి, లైంగికత్వం గురించి ఎందుకు చెప్పకూడదు? ఇంటర్నెట్, స్నేహితుల ద్వారా వాళ్లు చెప్పడం కన్నా నాన్న చెబితేనే మంచిది. 


మానసిక, శారీరక మార్పులు ఎలా ఉంటాయి?: యవ్వనంలో లైంగిక ఆకర్షణ సహజం. కూతురు అబ్బాయిల వైపు ఆకర్షితురాలవుతుంది. ప్రేమలో పడవచ్చు. హార్మోన్ల మార్పులను ఎవరూ ఆపలేరు. దాని గురించి కూతురికి తెలియజేయాలి. ఏది మంచో, ఏది చెడో చెప్పాలి. 

చెడ్డ స్నేహితులకు దూరంగా ఉండండి: యవ్వనంలో లైంగిక కోరిక ఎక్కువ ఉంటాయి.  ఏదైనా జరగవచ్చు. కాబట్టి, కూతురిని చెడ్డ స్నేహితులకు దూరంగా ఉంచండి. కొందరు స్నేహితులు, బాయ్‌ఫ్రెండ్స్ మంచిగా ఉండొచ్చు. కొందరు ఆకర్షణను వాడుకుంటారు. అలా చేస్తే కలిగే పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలియజేయాలి.

నాన్న కూతురికి మార్గనిర్దేశం చేయాలి, మంచి మాటలు చెప్పాలి. కానీ తీర్పు చెప్పకూడదు. నేను చెప్పిందే కూతురు వినాలని బలంవంత చేయకూడదు. కూతురు చెప్పింది ఇష్టం లేదంటే వదిలేయాలి. సంబంధాల గురించి మీ నిర్ణయాలను బలంగా చెప్పండి. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాల్సిన వయస్సు గురించి చెప్పండి.

లైంగికత్వం గురించి మాట్లాడండి: చాలామంది తల్లిదండ్రులు మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. కానీ ఎక్కడైతే స్వేచ్ఛగా మాట్లాడతారో వాళ్ళు నమ్మకంగా ఎదుగుతారు. తప్పుడు సమాచారం నుండి దూరంగా ఉంటారు. గర్భం, గర్భనిరోధకం గురించి కొంచెం చెప్పడం మంచిది. ముఖ్యంగా అమ్మ లేని పిల్లలకు నాన్న ఎంత చెప్తే అంత మంచిది. 

లైంగిక చర్యను అసహ్యంగా చెప్పకండి: దీని గురించి ఎవరికీ అసహ్యం ఉండకూడదు. ఇది ప్రతి మనిషికి సహజమైన కోరిక అని చెప్పాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా ఎలా సిద్ధం కావాలో చెప్పండి. శారీరక సంబంధానికి ఇద్దరు ఎలా సిద్ధం కావాలో పిల్లలకు తెలియాలి. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. తల్లిదండ్రులే చెప్తే మంచిది. అలాంటి బంధం నాన్న కూతుళ్ల మధ్య ఉండాలి.

Latest Videos

vuukle one pixel image
click me!