Relationship: అమ్మాయిలు ఎలా ఫ్లర్ట్ చేస్తారో తెలుసా?

ఫ్లర్టింగ్ గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. మరీ ముఖ్యంగా అబ్బాయిలు. వారు సహజంగానే ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తుంటారు. నచ్చిన అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడటం, వారిని నవ్వించడం లాంటివి చేస్తారు. అబ్బాయిలు ఫ్లర్ట్ చేస్తున్నారనీ ఈజీగా కనిపెట్టొచ్చు. వాళ్లు దొరికిపోతారు కూడా. అదే అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అస్సలు కనిపెట్టలేరు కూడా. మరి అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

Decoding Flirting Signs Girls Show That Guys Often Miss in telugu KVG

సాధారణంగా అబ్బాయిలు ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తుంటారు. కానీ అబ్బాయిలు మాత్రమే ఫ్లర్ట్ చేస్తారు అనుకుంటే పొరపాటే. అమ్మాయిలు కూడా ఫ్లర్ట్ చేస్తారు. కానీ అబ్బాయిలంత ఓపెన్ గా కాదు. మరి వాళ్లు ఫ్లర్ట్ చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చూసేయండి.

ఐ కాంటాక్ట్..

అమ్మాయిలు ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు. చాలాసేపు వారు కళ్ళతోనే ఫ్లర్ట్ చేస్తారు. అమ్మాయి నవ్వుతూ ఐ కాంటాక్ట్ చేస్తుంటే.. ఆమె మీతో ఫ్లర్టింగ్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. చాలామంది అమ్మాయిలకు కళ్లతోనే చంపేసే అలవాటు ఉంటుంది.


టచ్ చేస్తారు!

ఒకవేళ అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తుంటే వారు అబ్బాయిలను అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న టచ్‌లు చేస్తారు. సాధారణంగా మనసులో ఇష్టం లేకపోతే అమ్మాయిలు ఎవర్ని టచ్ చేయరు. 

జోకులతో..

అమ్మాయిలు తమకు ఇష్టమైన అబ్బాయిలతో డబుల్ మీనింగ్ మాటలు, జోకులు పంచుకుంటారు. వాళ్లు ఇష్టపడ్డ అబ్బాయితో మాత్రమే అలా ఉంటారు.
 

తమలో తాము మాట్లాడుకోవడం

చాలామంది అమ్మాయిలు ఫ్లర్ట్ చేసేటప్పుడు తమలో తామే మాట్లాడుకోవడానికి ట్రై చేస్తారు. దీని ద్వారా వాళ్లకి మీ మీద ఏదో ఫీలింగ్ ఉందని అర్థం చేసుకోవాలి.
 

సాయం కోరుతారు

అమ్మాయిలు తమకిష్టమైన అబ్బాయిల నుంచి సహాయం అడుగుతారు. నన్ను ఇంటి దగ్గర దిగబెడతారా? నాతో షాపింగ్ కి వస్తారా? గుడికి వెళ్దాం వస్తారా లాంటివి అడుగుతారు. 
 

జుట్టు సరిచేసుకోవడం

మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిని మీరు సడెన్‌గా చూస్తే ఆమె ఆందోళనకు గురవుతుంది. అంటే ఆమె తన జుట్టు లేదా డ్రెస్ సరిచేసుకోవడం, చుట్టూ ఉన్న వస్తువులను చక్కగా పెట్టుకోవడం లాంటివి చేస్తుంటుంది.

ఇంప్రెస్ చేయడానికి..

ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందంటే ఆ అమ్మాయి తను చేసే ప్రతి పనిలో మిమ్మల్ని మెప్పించడానికి ట్రై చేస్తుంది. మీకు ఇష్టమైన పనులే చేయడానికి చూస్తుంది.

Latest Videos

vuukle one pixel image
click me!