Relationship: ఇలాంటి కోడలు ఉంటే ఆ ఇల్లు నరకమే..!

కొన్ని రకాల లక్షణాలు ఉన్న కోడళ్లు ఇంట అడుగుపెడితే.. ఆ అత్తవారిల్లు నరకం చూస్తుంది. మరి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను కోడళ్లుగా తెచ్చుకోకూడదో తెలుసుకుందాం..

toxic daughter in law signs and traits


కుటుంబం అంటే ప్రేమ, గౌరవంతో నడిచే ప్రదేశం. ప్రతి ఒక్కరికీ ఒక కుటుంబం ఉంటుంది.మనకు పుట్టుకతో ఒక కుటుంబం ఉంటే, పెళ్లి తర్వాత మరో కుటుంబాన్ని అందిస్తుంది. ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత తనకు ఎలాంటి అత్తగారు వస్తారో అని ఎలా అయితే భయపడతుందో, తమ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉంటుందో అని భయపడే అత్తగార్లు కూడా ఉన్నారు. ఎందుకంటే.. వీరిద్దరి మధ్య బంధం బాగుంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతిసారీ అత్తగారిలో తప్పులు వెతకడమే కాదు.. కొన్ని రకాల లక్షణాలు ఉన్న కోడళ్లు ఇంట అడుగుపెడితే.. ఆ అత్తవారిల్లు నరకం చూస్తుంది. మరి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను కోడళ్లుగా తెచ్చుకోకూడదో తెలుసుకుందాం..


1.చిన్న విషయాన్ని కూడా పెద్దది చేయడం..
కొన్నిసార్లు చాలా మంది అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత గొడవలు సృష్టిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేసి, దానిని గొడవగా మార్చే ప్రయత్నం చేస్తారు. అత్తమామలు చెప్పే చిన్న మాటను కూడా నెగిటివ్ గా తీసుకొని, వాటిని మరోలా అర్థం చేసుకొని.. భర్తతో చెప్పడం, లేదా వాళ్ల పుట్టింట్లో చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇంట్లో జరిగే చిన్న వాదన ని కూడా..మరింత పెంచి, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టిస్తారు.


2. ఇంట్లోని పెద్దలను గౌరవించని కోడలు
భారతీయ సంస్కృతి లో కుటుంబ విలువలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. పెద్దల పట్ల గౌరవం చూపడం కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే, కొందరు కోడళ్లు అత్తమామలను గౌరవించకుండా, వాళ్ల మాటలను తక్కువగా తీసుకుని ప్రవర్తిస్తారు. వాళ్లు ఇచ్చే సలహాలను పట్టించుకోకుండా, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది కుటుంబ బంధాలను దెబ్బతీస్తుంది.

3. అత్తారింటి గురించి బయట చెడుగా మాట్లాడటం
పెళ్లయిన తర్వాత కొత్త కుటుంబంలో మెలగడం ప్రతి మహిళకు సవాలు కావొచ్చు. కానీ, కొందరు కోడళ్లు తమ అత్తవారింటి విషయాలను బయటకు తీసుకెళ్లి, పుట్టింటి వారికి చెడుగా చెప్పడం, స్నేహితులతో గాసిప్ చేయడం చేయడం వల్ల కుటుంబ పరువు మసకబారుతుంది. ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటే, వాటిని కుటుంబ సభ్యుల మధ్యే పరిష్కరించుకోవాలి గానీ, బయట చెబితే విభేదాలు మరింత పెరుగుతాయి.
 

4. భర్త మనసు మార్చడం
కొందరు కోడళ్లు భర్తకు ప్రతి విషయాన్ని వక్రీకరించి చెప్పి, అతని మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు. అత్తమామల గురించి అతనికి తప్పుడు అభిప్రాయాలను కలిగించే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా భర్త తన కుటుంబానికి దూరమైపోతాడు. కుటుంబ అనుబంధం తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య విశ్వాసం అనేది గట్టిగా ఉండాలి, కానీ తప్పుడు ఆరోపణలు, అపార్థాలు కలిగించటం వల్ల ఇంట్లో గొడవలు పెరుగుతాయి.

5. అసూయా, ఈర్ష్య కలిగి ఉండటం
ఒక వ్యక్తి ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించకపోతే, అది కుటుంబ సమతుల్యతను దెబ్బతీస్తుంది. కొందరు కోడళ్లు ఇంట్లోని ఇతర సభ్యులపై అసూయ తో ఉంటారు. వారి విజయాలను చూసి సంతోషించరు. అటువంటి కోడళ్లు ఇతర కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ సమానంగా సంతోషంగా ఉంటేనే కుటుంబం ఆనందంగా ఉంటుంది.
 

6. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం
కొందరు కోడళ్లు కుటుంబ బాధ్యతలను తక్కువగా భావిస్తారు. తమ వ్యక్తిగత జీవితానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కుటుంబ సభ్యులు అశాంతికి గురవుతారు. ఇంటి పని, కుటుంబ సభ్యుల సంరక్షణ, పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా వ్యవహరిస్తే, అది కుటుంబానికి ముప్పు తెచ్చే అవకాశముంది.
 

F

7. కుటుంబ సంపదను దుర్వినియోగం చేయడం
కొందరు కోడళ్లు కుటుంబ సంపదను అనవసరంగా ఖర్చు చేస్తారు. ఇతర కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా, తమ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.

8. ఇతరులతో పోల్చి భర్తను ఒత్తిడికి గురిచేయడం
కొందరు అమ్మాయిలు తమ భర్తను ఇతరులతో పోల్చుతూ, వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంటారు. "ఆమె భర్త ఇలా చేస్తాడు, నువ్వెందుకు చేయడం లేదు?" అనే విధంగా మాట్లాడటం వల్ల భర్త ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ఇది భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలను పెంచుతుంది.


చివరగా, కుటుంబం అనేది అందరి సహకారంతో నడిచే ఒక సమతుల్య వ్యవస్థ. ఒకరు బాధ్యత తీసుకోకపోతే, లేదా ఇతరులను అణగదొక్కేలా ప్రవర్తిస్తే, ఆ కుటుంబం నిలవదు. కోడలు, అత్తమామలు పరస్పర గౌరవంతో ఉంటేనే కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ప్రతి ఒక్కరూ సహనంతో, ప్రేమతో, సహకారంతో జీవించాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలను పెంచుకోవడం కంటే, వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం మంచిది.

Latest Videos

click me!