విడాకుల చట్టాలు కఠినంగా ఉండటం, ఆ దేశ సంస్కృతి, సామాజిక సంబంధాల ఆధారంగా ఒక దేశంలో విడాకుల ట్రెండ్ ఉంటుంది. కొన్ని చోట్ల విడాకులు సాధారణం అయితే, మరికొన్ని చోట్ల చివరి అస్త్రంగా ఉపయోగపడతాయి. భారతదేశం విషయానికొస్తే.. పెళ్లి ఇక్కడ ఏడు జన్మల బంధం. ఇక్కడి జంటలు తేలికగా విడిపోరు. పెళ్లి అంటే పవిత్ర బంధం, రెండు కుటుంబాల కలయిక. అందుకే భారతదేశంలో విడాకులు తక్కువ.
మరి ఎక్కడ విడాకులు అతి తక్కువో తెలుసా? ఖతార్, ఐర్లాండ్, యూఏఈ లాంటి దేశాల్లో విడాకుల శాతం చాలా తక్కువ. ఇక్కడి ప్రజలు సమాజ, మత సంప్రదాయాలను పాటిస్తారు. సంబంధాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. విడాకులు వారికి చివరి ఆప్షన్ మాత్రమే. ఈ దేశాల్లో సంస్కృతితో పాటు చట్టాలు కూడా విడాకులను కష్టతరం చేస్తాయి. శ్రీలంకలో 1000కి 0.15% మంది విడాకులు తీసుకుంటారు. గ్వాటెమాలా, వియత్నాంలో 0.2%.
పెరూ 0.5%, చిలీ 0.7%, గ్రెనడైన్స్, సెయింట్ విన్సెంట్ 0.4%, దక్షిణాఫ్రికా 0.6% విడాకులు జరుగుతాయి. మత విశ్వాసాలు, కుటుంబ విలువలు, చట్టాలు విడాకులను నిరుత్సాహపరుస్తున్నాయి. భారత దేశం విషయానికొస్తే మన దగ్గర విడాకుల శాతం 1 నుంచి 1.5శాతం మధ్యలో ఉంటోంది. ఇక్కడ పెళ్లైన వెయ్యి జంటల్లో 14 జంటలు విడిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.