మూడవది: మగవారు తన భార్య గురించి, భార్యలోని లోపాలను (Errors), రహస్యాలను (Secrets) ఇతరులతో అసలు చెప్పరాదు. భార్యతో గొడవపడిన సందర్భాల గురించి భార్య ప్రవర్తన గురించి పొరపాటున కూడా మూడో వ్యక్తికి తెలియపరచడం మంచిది కాదు. ఒకవేళ చెబితే మిమ్మల్ని సమాజం చులకనగా చూస్తుంది. మీ భార్య యొక్క రహస్యాలను, మీ వివాహ బంధంలోని విషయాలను తెలుసుకొని భవిష్యత్తులో మీ బంధం విడిపోవడానికి ఇతరులు కారణం అవుతారు. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలను ఇతరులతో చర్చించడం మంచిది కాదు.