జీవితంలో ఎవరితో ఒకరితో ప్రేమలో పడటం చాలా సహజం. అయితే.. ఆ ప్రేమ జీవితకాలం ఉంటుందనే గ్యారెంటీ లేదు. ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో సరదగా, అందంగా అనిపించినా.. కొంత కాలం తర్వాత ఆ బంధం భారంగా మారిన ఫీలింగ్ వచ్చేస్తుంది. దీంతో.. ఆ బంధంలో ఉండటం ఇష్టం లేక.. చాలా మంది బ్రేకప్ చెప్పేస్తూ ఉంటారు. అయితే.. అలా బ్రేకప్ చెప్పాల్సి వచ్చినప్పుడు కొందరు మానసిక సంఘర్షణకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాము చేస్తున్నది... తప్పా, ఒప్పా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కొన్ని విషయాలను గుర్తించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మీరు బ్రేకప్ చెప్పాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఎదుటివారి ఫీలింగ్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ.. ఎదుటివారి ఫీలింగ్స్ కీ, వారి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలి. తాము తీసుకున్న నిర్ణయం పట్ల వారు ఎలా ఫీలౌతున్నారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని. వారి ఎమోషన్స్ ని కించపరచకుండా.. నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. లేదంటే.. తాము ఈ బంధంలో కొనసాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో.. అర్థమయ్యేలా వివరించడం కూడా చాలా ముఖ్యం.
ఇక.. బ్రేకప్ చెప్పాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత.. వారితో ఉండకూడదు అనే ఉద్దేశంతో అబద్ధాలు చెప్పడం.. తప్పించుకు తిరగడం లాంటివి చేస్తారు. కానీ.. అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నిజాయితీగా ఉండమని సూచిస్తున్నారు. ఎవాయిడ్ చేయకూడదని చెబుతున్నారు. వారు నిజం తెలుసుకోవడానికి పూర్తిగా అర్హులు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. కాబట్టి.. వారికి వెంటనే నిజం చెప్పేయడం ఉత్తమం.
కొన్నిసార్లు గౌరవప్రదంగా ఉండే ప్రయత్నంలో, మనం మన మాటలను షుగర్ కోట్ చేస్తాము. మేము పరిస్థితిని సులభతరం చేయడానికి "ప్రస్తుతం కాదు" లేదా "భవిష్యత్తులో ఉండవచ్చు" వంటి ప్రకటనలను ఉపయోగించవచ్చు. అయినప్పటికీ, భవిష్యత్తులో మీతో ఉండే అవకాశాల గురించి వారికి ఆశాజనకంగా ఉండవచ్చు. మీరు ఖచ్చితంగా వాగ్దానం చేయలేకపోతే చెప్పకండి. మీ సమాధానంగా NO అని చెప్పడం సరైంది.
ఇక.. బ్రేకప్ చెప్పాలని నిర్ణయం తీసుకునే ముందు... దాని గురించి ఒకటికి, రెండు సార్లు ఆలోచించడం ఉత్తమం. ఒక్కోసారి ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఒకటికి రెండుసార్లు.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే..మంచిదని సూచిస్తున్నారు.
ఇక.. రిలేషన్ ప్రారంభించే సమయంలోనే అది.. శాశ్వతంగానే.. టెంపరరీగా అనే విషయాన్ని ఇద్దరూ ఒకసారి చర్చించుకోవడం కూడా మంచి నిర్ణయం. అలాంటి నిర్ణయం ముందే తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.