చాణక్య నీతి ప్రకారం ఇలాంటి భార్య ఉన్న భర్త ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు!

Published : Nov 03, 2025, 06:53 PM IST

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఆయన నీతి సూత్రాలు ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతుంటారు. చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన కుటుంబ జీవితం సాగించాలంటే.. మహిళలు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాలున్న భార్యను పొందిన భర్త చాలా సంతోషంగా ఉంటాడు. 

PREV
15
చాణక్యనీతి

ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాల్లో కుటుంబం, సంబంధాలు, నైతికత వంటి ఎన్నో అంశాల గురించి పేర్కొన్నాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలో బోధించాడు. చాణక్యుడి ప్రకారం, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న భార్య.. భర్త జీవితంలో సంతోషం, విజయానికి కారణం అవుతుందట. ఆ లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

25
అంకితభావం

చాణక్య నీతి ప్రకారం మంచి గుణాలు కలిగి, అంకితభావంతో ఉండే భార్య ఉన్న ఇల్లు స్వర్గంతో సమానం. భార్య తన భర్తను గౌరవంగా, ప్రేమగా చూసుకుంటే ఆ ఇంట్లో శాంతి నెలకొంటుంది. భర్త ఎంత కష్టంలో ఉన్నా.. భార్య చూపించే ప్రేమ అతనికి బలాన్నిస్తుంది. అంకితభావం అనేది అణుకువ కాదు. అది ప్రేమతో కూడిన సహచర్యమని చాణక్య నీతి చెబుతోంది. 

35
జ్ఞానవంతురాలు

“జ్ఞానం లేని సౌందర్యం ఆభరణంలేని స్త్రీతో సమానం” అని చెప్పాడు చాణక్యుడు. ఒక స్త్రీ అందంగా ఉండడం కంటే జ్ఞానవంతురాలు కావడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. జ్ఞానం అంటే కేవలం చదువు కాదు. అది జీవితాన్ని అర్థం చేసుకోవడం, పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించడం. అలాంటి భార్య భర్తను ఎప్పుడూ అర్థం చేసుకుంటుంది. కోపం కన్నా సహనం ప్రదర్శిస్తుంది. సహనమే దాంపత్య బంధాన్ని బలపరచే మూలమని చాణక్య నీతి చెబుతోంది.

45
భర్త విజయాన్ని కోరుకునే భార్య

చాణక్య నీతి ప్రకారం భర్త విజయం కోసం శ్రద్ధ చూపించే భార్య ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు. ఒక స్త్రీ తన భర్త కలలు, లక్ష్యాల కోసం మద్దతుగా నిలిస్తే, ఆ వ్యక్తి విజయవంతం కావడం కష్టమేమి కాదంటాడు చాణక్యుడు. అలాంటి భార్య ఉన్న భర్తకు ఎప్పుడూ ప్రోత్సాహం లభిస్తుంది. అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని చాణక్య నీతి చెబుతోంది.

55
ఇంటి నిర్వహణ

చాణక్యుని దృష్టిలో ఒక భార్య తన ఇంటిని చక్కగా నిర్వహించగలిగితే, అదే నిజమైన సంపద. ఇంటి పనుల్లో చురుకుగా ఉండే భార్య ఉన్న ఇంట్లో ఎప్పుడూ కష్టాలు ఉండవు. కుటుంబ సభ్యుల అవసరాలు, ఆర్థిక నియంత్రణ, సమయపాలన వంటివి కూడా ఇంటి పనుల్లో భాగమే. వాటిని చక్కగా నిర్వహించే భార్య ఉన్న భర్త ఎప్పుడూ ప్రశాంతంగా జీవిస్తాడు. అంతేకాదు భర్తను నమ్మి, అతనిపై నిష్ఠతో ఉండే భార్యే నిజమైన లక్ష్మీదేవి. అనుమానాలు, రహస్యాలు ఆ బంధాన్ని బలహీనం చేస్తాయి. ఒక స్త్రీ తన భర్తపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటే ఆ ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయని చాణక్య నీతి చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories