Relationship Tips: నేటి ఉరుకు పరుగుల జీవితంలో ఒకరితో మరొకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. కానీ, ప్రతిరోజూ కొన్ని మార్పులు చేసుకుంటే... దాంపత్య జీవితం సంతోషంగా మారడం పక్కా.
‘జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలనే పెళ్లి చేసుకున్నాం.. కానీ.. పెళ్లి తర్వాత ఆ సంతోషమే లేదు. ప్రతి చిన్న విషయానికీ మా మధ్య గొడవలే జరుగుతున్నాయి’ ఈ మాట చాలా మంది దంపతుల నోటి వెంట వినపడుతూనే ఉంటుంది. చిన్న చిన్న విషయాలే చివరికి పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉంటాయి. అలా కాకుండా.. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజూ కచ్చితంగా కొన్ని పనులు చేయాల్సిందే. ప్రతిరోజూ కొన్ని పనులు చేయడం వల్ల అసలు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవే రావు. మరి, అవేంటో చూద్దాం....
25
ఆఫీసు నుంచి రాగానే ఒక చిన్న హగ్...
పని ఒత్తిడి అందరికీ ఉంటుంది. కానీ ఎంత ఒత్తిడి ఉన్నా, అలసిపోయినా.. మీరు ఇంటికి రాగానే.. మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న హగ్ ఇవ్వండి. దీనిని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇది మీ బంధం, ఆనందాన్ని ప్రోత్సహించే హార్మోన్ ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది. మీ బంధాన్ని కూడా బలపరుస్తుంది.
35
పడుకునే ముందు....
చాలా మంది దంపతులు పడుకోవడానికి ఒక్క నిమిషం ముందు కూడా ఫోన్లు చూస్తూ ఉంటారు. అందుకే ముందు మీరు ఆ ఫోన్లు పక్కన పెట్టి... మీ భాగస్వామితో కనీసం పది నుంచి 15 నిమిషాలు మాట్లాడాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు.. ఆ రోజు మీకు ఎలా గడిచిందో, మీ సంతోషాన్ని, ఆందోళనల గురించి మాట్లాడాలి. ఇలా ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే.. మీ మధ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మీకు ఎంత పని ఉన్నా.. ఉదయం లేవగానే ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవాలి. ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్ చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న చిరు నవ్వు, చిన్న ముద్దు కూడా దంపతుల మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. అందుకే... వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
55
ఒకరి కోసం మరొకరు చిన్న పనులు చేయడం...
పెళ్లి అంటే.. ఒకరికొకరుగా జీవించడం చాలా అవసరం. మీ భాగస్వామికి కాఫీ ఇష్టమైతే... దానిని మీ చేతితో చేసి ఇవ్వండి. మీకోసం వారు చేసి ఇస్తే థాంక్యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి. థాంక్యూ, సారీలు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇవి మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి.