ఆచార్య చాణక్యుడు మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను బోధించాడు. ఆయన నీతి సూత్రాలు ఇప్పటికీ ఆచరించదగినవే. ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు అస్సలు దాచకూడదట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
15
నిజాయితీగా ఉండాలి
వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య నిజాయితీ, స్పష్టత చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామి చెప్పిన దేనికైనా మీరు కోపంగా ఉంటే.. లేదా వారు చెప్పే దేనికైనా మీరు అంగీకరించకపోతే ఆ విషయాన్ని వెంటనే మీ జీవిత భాగస్వామితో పంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు.
25
అంకితభావంతో ఉండాలి
భార్యాభర్తల మధ్య పరస్పరం అంకితభావం ఉండాలి. దానికి ఎలాంటి సంకోచం ఉండకూడదు. ఇద్దరి మధ్య అంకితభావం ఉంటే బంధం బలపడుతుంది. స్థిరంగా ఉంటుంది. అంకితభావం, బాధ్యతతోనే బంధం ఎక్కువ కాలం దృఢంగా ఉంటుంది.
35
ప్రేమను వ్యక్తపరచడానికి ఆలస్యం చేయద్దు
భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరచడానికి ఎప్పుడూ సంకోచించకూడదు. ఆలస్యం చేయకూడదు. ప్రేమను బయటపెట్టడానికి వెనుకాడకూడదు. సంకోచిస్తే బంధం బలహీనపడుతుంది. బహిరంగంగా ప్రేమను వ్యక్తపరిస్తే, బంధానికి కొత్త ఉత్సాహం, మాధుర్యం వస్తుంది. ఇద్దరూ మానసికంగా బాగా దగ్గరవుతారు.
భార్యాభర్తలు ఒకరిపై ఒకరు తమ హక్కులను ప్రతిపాదించుకోవాలి. దీనివల్ల వారి బంధం మానసికంగా బలపడుతుంది. ఒకరిపై ఒకరు హక్కులను ప్రతిపాదిస్తే, అధికార భావన కలిగి ఉంటే, ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది.
55
ఇష్టంగా మాట్లాడుకోండి
ఒకరితో ఒకరు ఇష్టంగా మాట్లాడుకోని భార్యాభర్తల బంధం ఎక్కువ కాలం నిలబడదు. సంకోచం వల్ల భార్యాభర్తలు తమ అవసరాలు, కోరికలను సరిగ్గా వ్యక్తపరచలేరు. మాట్లాడుకోకపోతే బంధం బలహీనపడుతుంది. కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య సంకోచం ఉండకూడదు. దాంపత్యం దీర్ఘకాలం ఉండాలంటే ఇష్టంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.