పెళ్లి బంధంలో ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన అవసరం. ఏ ఒక్కటి లోపించినా ఆ బంధం కొనసాగడం కష్టమవుతుంది. చాణక్య నీతి ప్రకారం, భార్యా భర్తల మధ్య గొడవలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. మరి ఆ కారణాలేంటో చూద్దామా
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. వ్యూహకర్త. ఆయన తన చాణక్య నీతి ద్వారా వ్యక్తిగత జీవితాలకు ఉపయోగపడే ఎన్నో సూచనలు చేశాడు. ముఖ్యంగా భార్యా భర్తల బంధం గురించి బోధించాడు. వివాహ బంధం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో తన నీతి సూత్రాల్లో వివరించాడు. భార్యా భర్తల మధ్య గొడవలు రావడానికి, విడిపోవడానికి అసలు కారణాలు ఏంటో తెలియజేశాడు. అవేంటో ఇక్కడ చూద్దాం.
25
ఆత్మీయత లోపం
చాణక్యుడి ప్రకారం వివాహ బంధంలో పరస్పర ప్రేమ, మైత్రీ, గౌరవం ముఖ్యమైనవి. ఇవి లేని బంధం ఎక్కువకాలం నిలబడదు. భార్యా భర్తల మధ్య పరస్పర అవగాహన లేకపోవడం, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, చిన్న విషయాలను కూడా పెద్దగా చేసుకోవడం వంటివి బంధాన్ని దెబ్బతీస్తాయి. చిన్న అసహనం, అనవసరమైన వాదనల కారణంగా బంధంలో చీలికలు మొదలవుతాయి. చాణక్య నీతి ప్రకారం ఒకరి అవసరాలను, భావాలను మరొకరు అర్థం చేసుకోవడంలో విఫలమైన జంటల మధ్య ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయి.
35
ఆర్థిక సమస్యలు
చాణక్యుడి ప్రకారం డబ్బు విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోవడం, ఖర్చులు నియంత్రించుకోలేకపోవడం, అప్పులు, ఆదాయ లోపం వంటి అంశాలు భార్యా భర్తల మధ్య ఉద్రిక్తత, అనిశ్చితిని పెంచుతాయి. ప్రత్యేకంగా ఒకరు అధికంగా ఖర్చు చేయడం, మరొకరు తక్కువగా ఖర్చు చేయడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. డబ్బు జాగ్రత్తగా ఉపయోగించేవారు మాత్రమే బంధాలను నిలబెట్టుకుంటారని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి.
చాణక్య నీతి ప్రకారం భార్యా భర్తల బంధంలో ఏ ఒక్కరూ నిజాయతీగా లేకపోయినా ఆ బంధం ఎక్కువకాలం నిలబడదు. అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం, స్వార్థంగా ఉండడం, కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకోకపోవడం, ఇతరుల ముందు ఒకరిని మరొకరు గౌరవించుకోకపోవడం, కుటుంబ సంప్రదాయాలు, సామాజిక నియమాలు పాటించకపోవడం వంటివి కూడా పెళ్లి బంధంలో ప్రేమ, విశ్వాసం తగ్గడానికి కారణమవుతాయి. మొదట ఇవి చిన్న చిన్న సమస్యలుగా కనిపించినా రాను రాను పెద్ద గొడవలకు దారితీస్తాయి.
55
సమాన బాధ్యతలు
చాణక్యుడి ప్రకారం భార్యా భార్తలు సమాన బాధ్యతలు తీసుకోవాలి. ఒకరికి మరొకరు అన్నింట్లో తోడుగా, నీడగా ఉండాలి. ఒకరిపైనే ఎక్కువ బాధ్యతలు పెట్టి, మరొకరు ఏం పట్టించుకోకుండా ఉంటే ఆ బంధంలో చీలికలు రావడం సహజం. ముఖ్యంగా పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ, ముఖ్యమైన నిర్ణయాల్లో సహకారం లేకపోతే ఒకరిపైనే బాధ్యతల భారం పడుతుంది. ఆ వ్యక్తి.. బంధం నుంచి బయపడాలని కోరుకుంటాడు. కాబట్టి సమాన బాధ్యతలు తీసుకోవడం మంచిదని చాణక్యుడు పేర్కొన్నాడు.