Relationship : ఏవండోయ్ పెళ్లాలు.. మీ మొగుళ్లను ఇలా పిలుచారో విడాకులే...!

Published : Jan 15, 2026, 11:54 AM IST

Wife and Husband Relationship: భార్యాభర్తల బంధం ఒకరిపై ఒకరికి ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే గౌరవం మీద నిలబడుతుంది. ఇవే లేనప్పుడు ఆ బంధం దెబ్బతింటింది. చట్టం కూడా ఇదే చెబుతుంది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు వచ్చిన ఈ కేసు అలాంటిదే. 

PREV
15
ఇలాకూడా భార్యాభర్తలకు విడాకులు ఇస్తారా..?

Relationship : గత ఏడాది ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. భర్తను భార్య మానసికంగా హింసించడం ఆధారంగా విడాకులు మంజూరు చేసింది. అయితే సదరు భార్యకు రూ.5 లక్షల శాశ్వత భరణం ఇవ్వాలని భర్తను కోర్టు ఆదేశించింది. తల్లిదండ్రుల మాట విన్నందుకు, భర్తను 'పెంపుడు ఎలుక' అని భార్య అనడం, అతనిపై దాడి చేయడంతో ఈ తీర్పు వచ్చింది.

25
అసలు విషయమేంటి?

ఈ కేసు 39 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి అయిన భర్త, 34 ఏళ్ల ప్రభుత్వ పాఠశాల టీచర్ అయిన భార్యకు సంబంధించింది. వీరిద్దరికీ 28 జూన్ 2009న హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లయింది. 5 జూన్ 2010న వీరికి ఒక కొడుకు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబు తల్లితో పాటు బిలాస్‌పూర్‌లో (ఛత్తీస్‌గఢ్) ఉంటున్నాడు.

గర్భవతిగా ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకుంటానని భార్య తనపై ఒత్తిడి తెచ్చిందని... పిండానికి హాని కలిగించేందుకు తన కడుపుపై తానే ఒత్తుకుందని భర్త కోర్టులో ఆరోపించాడు. అంతేకాదు తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకున్నానని... కానీ భార్య నిరంతరం వేరుగా ఉండాలని ఒత్తిడి తెచ్చేదని భర్త చెప్పాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టనని చెప్పినప్పుడు భార్య దారుణంగా ప్రవర్తించిందని... చాలాసార్లు తనపై దాడి చేసిందన్నారు. చివరకు తన తల్లి ముందే కొట్టిందని చెప్పాడు. తల్లిదండ్రుల మాట విన్నందుకు అవమానకరమైన మాటలతో 'పెంపుడు ఎలుక' అని పిలిచేదని కూడా సదరు భర్త కోర్టుముందు తన ఆవేదనను తెలిపాడు.

35
పదిహేనేళ్లుగా పుట్టింట్లోనే భార్య..

భర్త కోర్టుకు తెలియజేసిన వివరాల ప్రకారం... భార్య 24 ఆగస్టు 2010న తీజ్ పండుగ కోసం పుట్టింటికి వెళ్లింది... మళ్లీ అత్తారింటికి తిరిగి రాలేదు. బిడ్డ పుట్టిన తర్వాత జరిగిన ఏ కుటుంబ కార్యక్రమానికీ భర్తను పిలవలేదు, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు.

45
భార్య వాదన ఏంటి?

భార్య అన్ని ఆరోపణలను ఖండిస్తూ.. అత్తమామలు తనను ఎప్పుడూ కుటుంబ సభ్యురాలిగా చూడలేదని చెప్పింది. భర్త తనను మానసికంగా, ఆర్థికంగా హింసించేవాడని... మందు తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపించింది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో 'మీ తల్లిదండ్రులను వదిలి నాతో ఉంటేనే సమాధానం ఇవ్వు. లేకపోతే నన్ను మీ ఇంటికి రమ్మని అడగవద్దు' అని భర్తకు మెసేజ్ పంపినట్లు ఆమె ఒప్పుకుంది.

55
ఫ్యామిలీ కోర్టు, హైకోర్టు తీర్పు

2019లో ఫ్యామిలీ కోర్టు మానసికంగా హింసించడం, వదిలేసి వేరుగా ఉండటం ఆధారంగా భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పును భార్య ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సవాలు చేసింది.. కానీ హైకోర్టు ఆమె అప్పీల్‌ను కొట్టివేసింది. తల్లిదండ్రులను వదిలిపెట్టమని భర్తపై ఒత్తిడి తేవడం మానసిక క్రూరత్వమని కోర్టు పేర్కొంది. అలాగే రెండేళ్లకు పైగా కారణం లేకుండా అత్తారింటికి తిరిగి రాకపోవడం కూడా వదిలివేయడం కిందకే వస్తుందని పేర్కొంది. ఈ కారణాలతో భార్యాభర్తలు చట్టప్రకారం దూరమయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories