మీరు ఒక అమ్మాయితో ప్రేమ బంధాన్ని మొదలుపెట్టినప్పుడు అంతా కొత్తగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈ సమయంలో అమ్మాయి చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందుకే ఆమెకు పూర్తి సమయం, ప్రేమ, శ్రద్ధ ఇవ్వాలి. అప్పుడే ఆమెకు ఈ బంధంలో ఆత్మీయత, భద్రత కలుగుతాయి.
భార్యతో బంధం చాలా సీరియస్‌గా, ఎక్కువ కాలం ఉంటుంది. పెళ్లి తర్వాత భాగస్వామే కాదు, ఇల్లు, కుటుంబ బాధ్యతలు కూడా తోడవుతాయి. ఇలాంటి టైంలో భార్యను చూసుకోవడమంటే కుటుంబం, బంధాల మధ్య సమతుల్యం పాటించడమే.