విడిపోయిన ప్రేయసితో మళ్లీ బంధాన్ని కోరుకుంటున్నారా అయితే ఈ టిప్స్ మీకోసమే!

First Published | Dec 7, 2021, 5:51 PM IST

ఏదైనా బంధం కలకాలం కొనసాగాలంటే ప్రేమలో ఎటువంటి కలహాలు, అపోహలు ఉండరాదు. బంధం అనేది శాశ్వతంగా నిలవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బంధం జీవితాంతం కలిసి ఆనందంగా ఉండేలా చేస్తుంది. బంధాలు (Bonds) చాలా సున్నితమైనవి. బంధాలను కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం చేస్తూ బంధం తెగిపోకుండా చూసుకోవాలి. లేదంటే ఒక్క క్షణంలోనే బంధం తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ప్రేమ విషయానికి వస్తే మీరు మీ ప్రేయసితో విడిపోయి తిరిగి కలవడానికి ప్రయత్నిస్తుంటే కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..  
 

ప్రేమలో ఉన్నప్పుడు అలకలు, కోపాలు (Anger), తాపాలు సర్వసాధారణం. వాటన్నింటిని భరిస్తూ వారిలోని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా ఒకరికి ఒకరు పూర్తిగా తెలుసుకుంటూ లైఫ్ నీ హ్యాపీగా కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ప్రేమంటే ముద్దు, ముచ్చట్లే కాదు వారి మనసులోని భావాలను అర్థం చేసుకొనే శక్తిని కలిగి ఉండాలి. ఇలా ఉంటేనే ప్రేమలో ఎటువంటి కలహాలు (Conflicts) ఏర్పడవు. లేదంటే పోట్లాటలు, కొట్లాటలతో ప్రేమ విడిపోవడానికి దారితీస్తుంది. 

ప్రేమికులకు మధ్య అహం (Ego), గర్వం (Pride) ఉండకూడదు. అవి ఉంటే ప్రేమికుల మధ్య బంధం ఎక్కువ కాలం కొనసాగదు. ఇవి ఉంటే ఒకరి మీద ఒకరికి చెడు అభిప్రాయం ఏర్పడేలా చేస్తాయి. ఒకవేళ మీరు ఇటువంటి కారణాల ద్వారా మీ ప్రేయసితో విడిపోయినట్లయితే వారిని మళ్లీ తిరిగి పొందాలని వారితో బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నిస్తూంటే కొన్ని ప్రయత్నాలు చేస్తే మంచిది. కాబట్టి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

Latest Videos


గులాబీ పువ్వులు తీసుకెళ్లడం: మీ ప్రియసికి ఇష్టమైన డ్రెస్ (Favorite Dress) ను వేసుకుని గులాబీ పూల గుత్తితో వారి దగ్గరకు వెళ్లి మీ పొరపాట్లను క్షమించమని నిజాయితీగా అడగాలి. తన మనసును మార్చడానికి ప్రయత్నించాలి. మీ నిజాయితీని (Honest) అర్థం చేసుకొని తన మనసు మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఆమెపై చూపిస్తున్న ప్రేమను ఆమె అర్థం చేసుకుని మీతో కలవడానికి ఇష్టపడుతుంది. 
 

చాక్లెట్లు ఇచ్చి క్షమించమని కోరండి: చాక్లెట్స్ ఒక హ్యాపీ అట్మాస్పియర్ (Atmosphere) ను కలుగజేస్తాయి. చాక్లెట్ (Chocolates) బాక్స్ ను తనకు గిఫ్ట్ గా ఇచ్చి మీ తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి. ఇలా చేయడంతో మీలో నిజమైన ప్రేమను ఆమె అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మీతో బంధాన్ని తిరిగి కొనసాగించడానికి ఇష్టపడుతుంది.
 

పాట రూపంలో ప్రేమను తెలపండి: పాటతో ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. మీరు కూడా తమ స్వీయ గొంతుతో మంచి భావన కలిగిన పాటను (Song) పాడి ఆమె మనస్సును మార్చడానికి ప్రయత్నించాలి. పాట రూపంలో మీలోని ప్రేమను (Love) ఆమెకు తెలియపరచాలి. ఇలా చేయడంతో మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకుంటుంది.  

ఉత్తరం రూపంలో: కొందరు తమ మనసులోని భావాలను మాటల రూపంలో వ్యక్తపరచడానికి సంకోచిస్తారు. అలాంటప్పుడు ఉత్తరం (Letter) రూపంలో మీ భావాలను (Feelings) వ్యక్తపరుస్తూ ప్రేయసిని క్షమాపణలు కోరండి. ఇలా చేయడంతో ఆమె మీలో నిజాయితీని అర్థం చేసుకుని మీతో కలవడానికి ప్రయత్నిస్తుంది.

ఇష్టమైన ప్రదేశం: ఇద్దరూ కలిసి నేరుగా మాట్లాడుకోవడానికి ఇద్దరికీ ఇష్టమైన ప్లేస్ (Favorite Place) ను ఎంచుకోండి. ఈ ప్లేస్ మీ ఇద్దరి జ్ఞాపకాలను (Memories) గుర్తు చేస్తుంది. మీరిద్దరూ గడిపిన అందమైన అనుభూతులను గుర్తుచేస్తుంది. ఇప్పుడు మీ మనసులోని భావాలను ఆమెకు తెలియపరిచి ఆమె మనసును మార్చడానికి ప్రయత్నించండి. తప్పకుండా ఆమె మీ మనసును అర్థం చేసుకునే ఆస్కారం ఉంటుంది.

click me!