Love Marriage: ప్రేమ పెళ్లిళ్లే ఎందుకు ఎక్కువ సక్సెస్ అవుతాయి..?

First Published | Dec 6, 2021, 11:04 AM IST

ఇక ప్రేమ పెళ్లిళ్ల విషయంలో.. పెద్దల జోక్యం ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి.. వారికి నచ్చినట్లుగా.. ఎలాంటి ఆంక్షలు లేకుండా.. జీవితం సాగిపోతూ ఉంటుందట.

జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్యమైన ఘట్టం. అప్పటి వరకు ఎవరికి వారుగా బతికిన వారు.. పెళ్లి తర్వాత.. ఒకటిగా మారతారు.  ఒక్క పెళ్లితో రెండు కుటుంబాలు కూడా ఒకటిగా మారతాయి. అయితే..  అన్ని పెళ్లిళ్లు.. కలకాలం నిలపడవు. కొందరి విషయంలో.. పెద్దలు కుదిర్చి న పెళ్లిళ్లు సక్సెస్ అయితే.. కొందరికి మాత్రం.. ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ అవుతాయి.  అయితే.. ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి కారణమేంటో .. దీనిపై నిపుణుల అభిప్రాయమేంటో ఓసారి చూద్దాం..

ప్రేమ పెళ్లిళ్లు.. చేసుకునేవారికి ఒకరి గురించి మరొకరికి ఎక్కువ కాలం నుంచి  తెలిసే ఉంటుంది. ఇద్దరిలో ఎవరికి ఏం ఇష్టం.. ఏం ఇష్టం ఉండదు అనే విషయం తెలుస్తుంది. కాబట్టి.. వాటికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటారట. అయితే.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో.. ఒకరి గురించి మరోకరు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పడటంతో.. అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ లోపు సమస్యలు మొదలయ్యే అవకాశం కూడా ఉందట.


పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో.. దాదాపు ఒకేలాంటి కల్చర్ ఉన్నవారితో వివాహం జరిపిస్తారు. కానీ.. ప్రేమ పెళ్లిలో.. ఒక్కోసారి కులాలు, మతాలు, సంప్రదాయాలు అన్నీ భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో.. ఒకరి సంప్రదాయానికి మరొకరు గౌరవం ఇస్తూ.. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.


ఇక ప్రేమ పెళ్లిళ్ల విషయంలో.. పెద్దల జోక్యం ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి.. వారికి నచ్చినట్లుగా.. ఎలాంటి ఆంక్షలు లేకుండా.. జీవితం సాగిపోతూ ఉంటుందట.


ఇక.. లవ్ మ్యారేజ్ చేసుకునే జంటలు.. ప్రతి విషయంలో ఒకరికి మరొకరు మద్దతుగా ఉంటారు. అన్ని విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా.. వీరు బెనిఫిట్ గా మారే అవకాశం ఉంది.

ప్రేమ పెళ్లి చేసుకునే దంపతులకు.. తమ పాజిటివ్ లతో పాటు.. నెగిటివ్ ల గురించి కూడా ముందే తెలిసి ఉంటుంది. పెళ్లి ముందే.. ఈ విషయంలో వారికి ఒక అవగాహన ఉంటుంది.
 

ప్రేమ పెళ్లి చేసుకునే దంపతులకు.. కావాలనుకున్నంత స్వేచ్ఛ దొరుకుతుంది. వారికి నచ్చినట్లు ఉండటానికి పెద్ద స్కోక్ దొరుకుతుంది. ఇలానే ఉండాలి.. అలానే ఉండాలి అనే ఆంక్షలు ఏమీ వీరికి ఉండవు.

లవ్ కపుల్స్.. ఒకరికి మరొకరు పూర్తిగా గౌరవం ఇస్తారు. అన్ని విషయాల్లో తమదే పై చేయిగా ఉండాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ అన్ని విషయాల్లో సమానం అని భావిస్తారు. ఇక ఏదైనా సమస్య వచ్చినా.. ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలని అనుకుంటారు.

ఇక... ప్రేమ పెళ్లి చేసుకున్నవారి సెక్స్ లైఫ్ కూడా చాలా బాగుంటుందట. ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంటుంది కాబట్టి.. వారి మధ్య రొమాన్స్, సెక్స్ కి స్కోప్ ఎక్కువగా ఉంటుందట.

Latest Videos

click me!