Relationship: రిలేషన్ షిప్ దక్కించుకోవాలా.. అయితే వాటిని వదిలించుకోవాల్సిందే?

First Published | Aug 9, 2023, 2:02 PM IST

 Relationship: చాలామంది ప్రేమిస్తారు కానీ దానిని పెళ్లి వరకు తీసుకు వెళ్ళటంలో విఫలమవుతారు అలాంటి వాళ్ళ కోసమే ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు కొన్ని సలహాలిస్తున్నారు.అదేంటో చూద్దాం.
 

సాధారణంగానే సద్గురు దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం కచ్చితంగా ఉంటుంది అలాంటిది రిలేషన్ కాపాడుకోవడం కోసం కూడా ఆయన దగ్గర చక్కని పరిష్కారం ఉంది. యువత సమస్యలని బాగా అర్థం చేసుకున్న సద్గురు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా చెబుతున్నారు.
 

సద్గురు చెప్పినట్లు మీలో ఉన్న ప్రేమ సక్సెస్ అవ్వాలంటే ముందు మీరు కొన్నింటిని వదులుకోవాలి అయితే అవి జీవితకాలం కాదన్న సంగతి గుర్తుంచుకోండి. మీ రిలేషన్ సక్సెస్ కావాలంటే ముందుగా ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం.
 

Latest Videos


 ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో స్వార్థంగానే ఉంటారు. ఎదుటివారికి ఏం కావాలో వాటిని ఇస్తూ ప్రేమిస్తే అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా నీ ప్రేమని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తారు. ప్రేమలో ఓడిపోవడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది.
 

అందుకని జీవితంలో ఓడిపోకుండా చూడండి. ఎదుటివారి దగ్గరనుంచి మీరు ప్రేమని కావాలి అనుకున్నప్పుడు చాలా విషయాలని వదులుకోవటమే మంచిది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఆరాటం వద్దు.
 

ఉదాహరణకి ఈ షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఇద్దరికీ ఒకే వస్తువు నచ్చినట్లయితే ఆ వస్తువుని ఆమె కోసం వదులుకోవటం ప్రేమ అవుతుంది. మీకు ఇష్టం లేకపోయినా తన కోసం బయటికి వెళ్తుంటే అదే మిమ్మల్ని మీరు వదులుకొని అవతలి వాళ్ళని కావాలనుకోవడం. అలా వదులుకోవటంలో చాలా ఆనందం ఉంటుంది.
 

మీ పార్ట్నర్ కోరుకున్న దానికంటా మీరు ఎక్కువ చేయటం వలన కూడా మీరు మీ భాగస్వామి యొక్క ప్రేమ అభిమానాన్ని పొందవచ్చు. రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు జీవితాంతం వారి ప్రేమని వదులుకోకుండా కాపాడుకుంటూ వస్తారు ఎందుకంటే ప్రేమ అజరామరం. స్వార్థం లేని ప్రేమ ఎప్పటికైనా గెలిచి తీరుతుంది.

click me!