Relationship: చాణక్య నీతి ప్రకారం భార్యకి ఈ లక్షణాలు ఉండి తీరాలి?

First Published | Aug 8, 2023, 2:22 PM IST

Relationship: భార్యాభర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తే అనుబంధం కొనసాగుతుందో, ఏం చేస్తే ఆ సంసారం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుందో ఏనాడో చెప్పాడు చాణిక్యుడు. అతను చెప్పిన ప్రకారం భార్య ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
 

చాణిక్య నీతి ప్రకారం భార్యకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి.. వారితో మనం ఎలా జీవించాలి? వారితో ఎలా పనిచేయించుకోవాలి అనే విషయాలని సవివరంగా సూచించాడు. భార్య అంటే పవిత్రంగా, కౌసల్యంగా, భర్త పట్ల అనురాగం కలిగి ఉండేలాగా ఉంటే ఆ భార్యకి పరిపూర్ణత్వం వస్తుంది.
 

చాణుక్యుడు ఉద్దేశం ఏమిటంటే మన జీవిత భాగస్వామి పవిత్రంగా ఉండాలి. తన భర్త ఎడల ప్రేమానురాగాలని పంచాలి అన్యోన్యంగా కాపురం చేయాలి. భర్తకి అన్ని విషయాల్లోనూ ముందుండి నడిపించాలి. విజయంగా భావించాలి. అప్పుడే ఆ భర్త తను అనుకున్నది సాధించి విజయం శిఖరాలని అందుకుంటాడు.
 

Latest Videos


మనసా వాచా కర్మణా అన్నట్లు భర్త కోసమే భార్య జీవించినట్లయితే ఆ సంసారం స్వర్గంలా మారుతుంది. అప్పుడే ఆ భర్త కి భార్య మీద  ప్రేమ, గౌరవం పెరుగుతాయి. భర్తతో ఎప్పుడూ తప్పుగా మాట్లాడుకూడదు అతనితో ఎప్పుడూ నిజమే చెప్పాలి.
 

భర్త బాధలో ఉన్నప్పుడు ఒక తల్లిగా లాలించాలి. అబద్ధం చెప్పకూడదు అలాగే భర్తకి అపకీర్తి తీసుకువచ్చే పనులుచేయకూడదు. అలాగే వైవాహిక జీవితంలో చీలికలు ఏర్పడితే దానిని తొలగించుకునే బాధ్యత భార్యదే. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలని ఎప్పటికీ ఆహ్వానించకూడదు.
 

అలాగే భార్య ఎప్పుడూ తన భర్త కోరికను నెరవేర్చాలి. మీ ప్రేమను అందించడం ద్వారా అతన్ని సంతృప్తి పరచండి. భర్త కూడా తన భార్య కోరికలను నెరవేర్చాలి లేదంటే వారి మధ్య గొడవకి ఆస్కారం ఉంటుంది. అలాగే భర్త బయట సమస్యలతో బాధపడుతున్నప్పుడు అతని మనసుని శాంతింప చేయడానికి ప్రయత్నించాలి.
 

భర్త అడిగిన వెంటనే భార్య ఈ పనులు చేయాలి. ఇంకా చెప్పాలంటే ఒక భార్య ఒక తల్లిలాగా మారడం వలన ఆ భర్త కి భార్య మీద ప్రేమతో పాటు తల్లి మీద చూపించే గౌరవం కూడా కలుగుతుంది.

click me!