Relationship: అలా ప్రవర్తిస్తున్నారా.. అయితే మీ రిలేషన్ షిప్ బ్రేక్ అయినట్లే?

First Published | Jun 30, 2023, 2:58 PM IST

Relationship: ఒక్కొక్కసారి తెలిసి తెలియక చేసిన పొరపాట్లే బంధాన్ని ముక్కలు చేసేస్థాయి. మన రిలేషన్ బ్రేక్ కాకుండా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలో చూద్దాం రండి.
 

ఎన్ని రోజుల్లో బంధం ఏర్పరుచుకోవడం సులువే కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. పెళ్లయిన ప్రతి జంట కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటారు ఆ తాపత్రయంతోనే తెలిసి తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటారు.దీనివల్ల ఇద్దరి మధ్యన గొడవలు జరిగే అవకాశం ఉంది.
 

 అందులోనూ ఇలాంటి విషయాల వల్ల మన పార్ట్నర్స్ కి ముందు ఉన్నంత ప్రేమగా తర్వాత మన మీద  ఉండకపోవచ్చు. కాబట్టి ఆలోచించి అడుగు వేయండి. మీకు మీ భాగస్వామి మీద విపరీతమైన ప్రేమ ఉండి ఉండవచ్చు అందుకోసం అస్తమానం ఫోను చేయటం మెసేజ్ పెట్టడం తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇలాంటివి చేయకండి.
 


ఎందుకంటే అది అవతలి వ్యక్తిని చాలా ఇబ్బందికి గురి చేయవచ్చు. ఎంత ప్రేమ అభిమానం ఉన్నప్పటికీ ఎవరి ఓన్ స్పేస్ లు వాళ్ళకి ఉండాలని తెలుసుకోండి. అలాగే నిర్లక్ష్యం చేయటం కూడా  బంధాన్ని ముక్కలు చేస్తుంది. అందుకే అటు అతిగాను ప్రవర్తించకూడదు ఇటు నిర్లక్ష్యంగాను ప్రవర్తించకూడదు.
 

 మీ పార్ట్నర్ తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తే సహనంగా భరించి వాటిని క్షమించండి. అది మీ బంధాన్ని నిలబెట్టడంతో పాటు రేపు మీరు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పెళ్లికి ముందు జీవితం గురించి పదేపదే ప్రస్తావించకండి.
 

ఆ గతంలో మీకు తెలియని ఇబ్బందులు ఏవో వాళ్ళకి ఉండి ఉంటాయి అందుకని గతాన్ని ఎక్కువగా తవ్వకండి. వాళ్లకి మీతో తన గతాన్ని చెప్పుకోవాలి అనే అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్లే కచ్చితంగా మీకు చెప్తారు. అలాగే ఎత్తిపొడుపు మాటలు తగ్గించండి. అందరికీ అన్ని విషయాల్లోనూ అవగాహన ఉండకపోవచ్చు తెలియని దానిని ప్రేమగా దగ్గర ఉండి నేర్పించండి.
 

 అంతేకానీ చేస్తున్న పనిని వెక్కిరించటం వల్ల వాళ్లకి ఆసక్తి తగ్గిపోయి ఆ పని మళ్లీ చేయలేరు. మన బంధాన్ని నిలుపుకోవాలంటే సరైన ఆయుధం ప్రేమ, సహనం, శ్రద్ధ అని గుర్తుంచుకోండి.

Latest Videos

click me!