వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైన విషయం. ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. పెళ్లి తర్వాత ప్రారంభమయ్యే కొత్త జీవితం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కానీ అర్థం చేసుకొని అడుగు ముందుకు వేస్తే ఆలుమగల బంధం మధురంగా మారుతుంది.
పెళ్లి తర్వాత చాలామందికి ప్రాముఖ్యతను మారిపోతూ ఉంటాయి పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ పార్టీలు ఔటింగ్ ఇలాంటి వాటికి ప్రాధాన్యతని ఇస్తారు కానీ పెళ్లి తర్వాత కచ్చితంగా మీ భాగస్వామికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఎప్పుడైతే మీరు ప్రాధాన్యతను ఇస్తారో అవతలి వాళ్ళు కూడా మీకు ప్రాధాన్యతని ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
అలాగే మీ భాగస్వామితో ఏమైనా మాట్లాడేటప్పుడు అవి బంధానికి ప్రతిబంధకంగా మారుతాయేమో ఒకసారి ఆలోచించి చెప్పాలో వద్దు ఆలోచించుకొని అప్పుడు మాట్లాడండి లేకపోతే భర్త దగ్గర నిజాలు రాయకూడదు అనుకుని లేనిపోని రహస్యాలు చెప్తే అది మరింత ప్రమాదం.
బంధాన్ని వెలుక్కుని ప్రయత్నంలో ఒక్కొక్కసారి రాజీపడటం ఎంత అవసరమో ఒక్కొక్కసారి యాగి చేయడం కూడా అంతే అవసరం. అంతే కదండీ మెత్తగా చెప్పినప్పుడు వినకపోతే గట్టిగా చెప్పడంలో తప్పులేదు. కాకపోతే తెగేవరకు లాగకుండా చూసుకోండి.
పెళ్లి అయిన వెంటనే భాగస్వామి కోసం మారాలి అనుకోవడం కూడా తప్పే అవుతుంది మీలా మీరు ఉండండి చాలు. అవతలి వ్యక్తి మిమ్మల్ని ప్రేమించేలాగా నడుచుకుంటే మీరు ఎలా ఉన్నా ఎదుటివాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక చక్కని చిట్కా క్షమాపణ చెప్పడం మరియు క్షమించడం.
నిజమేనండి మీ వల్ల తప్పు జరిగినప్పుడు ఈగోకి పోకుండా క్షమాపణ చెప్తే అవతలి వ్యక్తి దృష్టిలో మీ స్థానం ఎక్కడికో వెళ్తుంది. అదే మీ జీవిత భాగస్వామి తప్పు చేసినప్పుడు కూడా అర్థం చేసుకొని క్షమించగలిగితే అది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. కలిసి అడిగేయండి.. కలకాలం కలిసి ఉండండి.