Relationship: చాణిక్య నీతి ప్రకారం.. ఇలాంటి వాళ్లని అస్సలు దూరం పెట్టకండి!

First Published | Sep 21, 2023, 3:27 PM IST

 Relationship: జీవితంలో మంచి భార్య భర్తలు ఎలా ఉండాలో చాణిక్యుడు ఎప్పుడో వివరించాడు. అలాగే ఎవరిని నమ్మాలో, ఎలా జీవించాలో ఎవరిని వదులుకోవాలో అని ఎప్పుడో చెప్పాడు. అయితే చాణిక్య నీతి ప్రకారం ఇలాంటి వాళ్ళని వదులుకోకూడదట. వాళ్ళు ఎవరో చూద్దాం.
 

కుటుంబానికి ఆధారం మహిళ అని చాణిక్యుడు పేర్కొన్నాడు. సమాజంలో స్త్రీ విద్యను పొందడం చాలా ముఖ్యం చదువుకున్న స్త్రీ భర్త వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తుంది. స్త్రీ అందం కంటే ఆమె గుణాలు విలువలు ముఖ్యం. సత్ప్రవర్తన గల మహిళ ఎక్కడ నివసించినా ఆమె అన్నింటిని చక్కదిద్దుతుందని, అలాంటి స్త్రీ భార్యగా వస్తే వదులుకోవద్దు అంటున్నాడు చాణిక్యుడు.
 

అలాగే సొంత వారితో ఎలా నడుచుకోవాలో చెబుతూ ఎలా హద్దులు దాటకూడదో కూడా వివరించాడు. అలాగే క్లిష్ట సమయాల్లో తోడబుట్టిన వాళ్ళ నైజం బయటపడుతుందని చెప్పాడు చాణిక్యుడు. ఎందుకంటే ఆనందకరమైన సమయంలో ప్రతి ఒక్కరు మీకు మద్దతు ఇస్తారు.
 

Latest Videos


 కానీ ఏదైనా ఆపద కలిగినప్పుడు మాత్రమే అసలు నైజం బయటపడుతుంది. అందువల్ల మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు ఎవరైతే అండగా ఉంటారో వారిని మాత్రమే గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోకండి. మమకారం ఉన్నచోటే  ఆప్యాయత, ప్రేమ ఉంటుంది.
 

 అలాగే ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీకంటూ ఒక స్నేహితుడు తోడుగా నిలబడతాడు. ఎవరైతే ఆ సమయంలో మీ కంటికి కనిపించరో వారిని మళ్లీ చేరదీయకండి. ఎవరైతే మీకు తోడుగా ఉన్నాడో ఆ స్నేహితుడిని ఎప్పుడూ వదులుకోకండి.అలాగే సంపద లేనప్పుడు జీవిత భాగస్వామి యొక్క గుణగణాలు గుర్తించబడతాయి.
 

 సంపద లేదు అని మిమ్మల్ని నిందించకుండా సంపాదన కోసం మీ వెనకే నిలబడి మీకు సరైన మార్గనిర్దేశకత్వం ఇచ్చిన భాగస్వామిని ఎన్నడు దూరం చేసుకోకండి. అలాగే నిరంతరం భాగస్వామి గురించి ఆలోచిస్తూ ఆపద వచ్చినా,ఆనందం వచ్చినా భర్త వెన్నంటి ఉండి నిజమైన ప్రేమను పంచుకునే భాగస్వామిని ఎప్పుడు వదులుకోకండి.
 

 వారి వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురైనా క్షమించగలగడం ఎంతో ఉత్తమం. చిన్న చిన్న విషయాలకు అలాంటి వాళ్ళని దూరం చేసుకుంటే మన జీవితంలో అనిస్థితి చోటు చేసుకుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని దూరం చేసుకోవడంలో తొందరపడకండి.

click me!