ఫీమేల్ సెక్స్ హార్మోన్ల లోపం మీ లైంగిక జీవితాన్ని బోరింగ్ గా చేస్తుంది.. వీటిని ఎలా పెంచుకోవాలంటే?

First Published | Sep 21, 2023, 11:53 AM IST

వయసు పెరిగినా కొంతమంది ఆడవారు లైంగికంగా కూడా ఎంతో చురుగ్గా ఉంటారు. మరికొంతమందిలో లైంగిక ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల సెక్స్ లైఫ్ బోరింగ్ గా మారుతుంది. మరి ఫీమేల్ సెక్స్ హార్మోన్లు పెరగడానికి ఏం చేయాలంటే? 
 

ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత ఒక సాధారణ సమస్య. ప్రెగ్నెన్సీ, పీరియడ్స్, వయసు,స్ట్రెస్, మెనోపాజ్ వంటివి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. హార్మోన్ల అసమతుల్యత ఆడవారి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యం, లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీకు కూడా సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉంటే.. ఇవి స్త్రీ సెక్స్ హార్మోన్ల తగ్గుదలకు సంకేతాలు కావొచ్చంటున్నారు నిపుణులు. 
 

sex life


హార్మోన్ల అసమతుల్యతకు కారణమేంటి?

హార్మోన్ల సమతుల్యత క్షీణిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా లైంగిక హార్మోన్ల అసమతుల్యత సమస్యను కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సాధారణంగా మెనోపాజ్ సమయంలోనే ఆడవాళ్లు లైంగిక హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మెనోపాజ్ తో పాటుగా ఆడవాళ్లలో లైంగిక హార్మోన్ల అసమతుల్యతకు  తక్కువ శరీర బరువు, పోషకాహార లోపం వంటి ఎన్నో సమస్యలు కూడా కారణమవుతాయి. ముఖ్యంగా 30, 40 ఏళ్ల తర్వాత సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని జీవనశైలి అలవాట్లతో ఆడవాళ్లు లైంగిక హార్మోన్లను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. 


Image: Getty Images

ఫీమేల్ సెక్స్ హార్మోన్లు అంటే ఏమిటి?

ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ లు ప్రధాన సంతానోత్పత్తి హార్మోన్లు. ఇవి లైంగికత, సంతానోత్పత్తికి సహాయపడతాయి.  ప్రెగ్నెన్సీ, పీరియడ్స్, సెక్స్, మెనోపాజ్, సెక్స్ డ్రైవ్, ఇతర శారీరక కార్యకలాపాలకు ఇవి బాధ్యత వహిస్తాయి. మహిళల్లో అండాశయంలో ఈ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు కొన్నిసార్లు అసమతుల్యతకు గురవుతాయి. దీని వల్ల వంధ్యత్వం, తక్కువ సెక్స్ డ్రైవ్, గర్భం దాల్చడంలో ఇబ్బంది కలుగుతుంది. మరి ఫీమేల్ సెక్స్ హార్మోన్లు పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Image: Getty Images

గట్ ఆరోగ్యం

మన గట్ లో ఎన్నో రకాల మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఎన్నో రకాల జీవక్రియలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇది మీ సెక్స్ హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. పబ్మెడ్ సెంట్రల్ ప్రకారం.. గట్ మైక్రోబయోమ్ ఇన్సులేటెడ్ నిరోధకత, సంతృప్తిని కలిగిస్తుంది. అలాగే ఇది సెక్స్ హార్మోన్లను నియంత్రిస్తుంది. పేలవమైన జీర్ణక్రియ జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల చాలా బరువు పెరిగిపోతారు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ కారకాలన్నీ పునరుత్పత్తి హార్మోన్లను అసమతుల్యం చేస్తాయి. ఈ సమస్య రావొద్దంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. 
 

Image: Getty Images

ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ 

పోషకాహారాన్ని తినడం వల్ల రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సెక్స్ డ్రైవ్ మెరుగ్గా ఉండాలంటే లిబిడోను తగ్గించే ఆహారాలకు దూరంగా ఉండండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది లిబిడోను తగ్గిస్తుంది. అందుకే మీరు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తినండి. అలాగే చక్కెరను తక్కువగా తీసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి మెరుగుపడుతుంది. అలాగే లిబిడో పెరుగుతుంది.
 

Image: Getty Images

ఒత్తిడి, ఆరోగ్యకరమైన నిద్ర 

సెక్స్ హార్మోన్ల అసమతుల్యతకు ఒత్తిడి ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఒత్తిడి ఒక మానసిక సమస్య. దీని వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు కంటినిండా నిద్రపోలేరు. నిద్ర లేకపోవడం వల్ల మీ ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల సెక్స్ హార్మోన్ల స్థాయి ఎంతో ప్రభావితం అవుతుంది. దీని వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. లేదా యోని పొడిబారుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే స్ట్రెస్ మేనేజ్ మెంట్ పద్దతులను పాటించాలి. ధ్యానం, యోగా వంటివి చేయాలి. అలాగే టైంకు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. 
 

స్మోకింగ్ 

సిగరెట్లను తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా బాగా దెబ్బతింటుంది. అంతేకాదు సిగరెట్ పొగ సెక్స్ హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. మంచి లైంగిక పనితీరుకు గుండె ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే వీలైనంత తొందరగా సిగరెట్లను మానేయండి. దీంతో మీ స్టామినా, సెక్స్ డ్రైవ్ రెండూ పెరుగుతాయి.
 

Marrige sex


మీ సంబంధానికి సమయం కేటాయించండి

బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడేంత సమయం ఉండదు. కానీ ఇది మీ భాగస్వామికి మిమ్మల్ని దూరం చేస్తుంది. అందుకే సమయం కుదుర్చుకుని మీ భాగస్వామి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. చాలా మందికి కొన్నిసార్లు సెక్స్ కోరికలు తగ్గుతాయి. అలాగే సెక్స్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. మీ రిలేషన్ షిప్ బాగుంటే మీ సెక్స్ హార్మోన్లు పెరుగుతాయి. సెక్స్ డ్రైవ్ కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు. మీ రిలేషన్ షిప్ మెరుగ్గా ఉండటానికి ఒకరితో ఒకరు నిర్మోహమాటంగా మాట్లాడాలి. మీ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. అలాగే కలిసి కొన్ని  పనులను చేయండి. 

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే కూడా లైంగిక ఆనందాన్ని కలిగించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది మీ సెక్స్ డ్రైవ్ ను కూడా బాగా పెంచుతుంది. అంతేకాదు ఇది మీ సెక్స్ హార్మోన్లను కూడా పెంచుతుంది. ఇది లిబిడోను కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.  అందుకే సంభోగానికి ముందు ఒకరినొకరు తాకడం, ముద్దు పెట్టుకోవడం, సెక్స్ బొమ్మను ఉపయోగించడం, ఓరల్ సెక్స్ లో పాల్గొనడం వంటివి చేయండి. ఇది మీ లైంగిక అనుభవాన్నిపెంచుతుంది.  మహిళలకు ఫోర్ ప్లే చాలా ముఖ్యమైనది. పబ్మెడ్ 2017 పరిశోధన ప్రకారం.. సుమారు 18% మంది మహిళలు హస్త ప్రయోగంతో భావప్రాప్తి పొందుతారు, 33.6% మంది మహిళలు భావప్రాప్తికి క్లిటోరిస్ ఉద్దీపన అవసరమని నివేదించారు.

Latest Videos

click me!