సాధారణంగా పెళ్లిడుకున్న అమ్మాయిలు తన భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ ఒక అంచనాకి వస్తారు. వాళ్ళని తలుచుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటారు. అయితే అబ్బాయిలలో అన్ని మంచి లక్షణాలు ఉండటం చాలా కష్టమే కానీ అబ్బాయిలలో ఉండే కొన్ని లక్షణాలు మాత్రం అతనిని మంచి భర్తగా నిలబెట్టలేవు అంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక అబ్బాయి పెళ్ళికి ముందు ఎంత బాధ్యత లేకుండా తిరిగినా పెళ్లి అయిన తర్వాత బాధ్యతగల వ్యక్తిగా కచ్చితంగా మారి తీరాలి. బాధ్యతలేని ఒక వ్యక్తి ఒక మంచి భర్త కాలేడు, ఆ భార్యకి సపోర్ట్ ఇవ్వలేడు. అలాగే భార్యతో సరిగా కమ్యూనికేషన్ చేయలేని వ్యక్తి మంచి భర్త కాలేడు.
ఒక భార్య తనకి ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా భర్తకి చెప్పుకోవాలనుకుంటుంది. అయితే ఆ భర్త ఆమె చెప్పే భావనని రిసీవ్ చేసుకుని ఆమెకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగిన మెంటాలిటీ కలిగి ఉండాలి. అప్పుడు అతను మంచి భర్త అవుతాడు.
అలాగే మెచ్యూరిటీ కూడా ఎక్కువగా ఉండాలి. బంధాల గురించి ఆలోచించి సమస్యలను తేలికగా పరిష్కరించే వ్యక్తి మంచి భర్త అవుతాడు. ఎలాంటి సమస్య వచ్చినా నా భర్త ఉన్నాడు అనే ధీమా ఆ భార్యకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.
ఇక ఆఖరిది అతి ముఖ్యమైనది నమ్మకం. ఏ భార్య అయినా నమ్మకస్తుడైన భర్తని కోరుకుంటుంది. ఒక పురుషుడిలో ఇలాంటి లక్షణం లేకపోతే అతను మంచి భర్త కాలేడు. ఒక భార్య తన భర్తని నమ్ముకుని జీవితాన్ని ప్రారంభిస్తుంది.
అలాంటి భర్త నమ్మకస్తుడు కానప్పుడు ఆమె జీవితం ప్రశ్నార్ధకంగా మారుతుంది. కాబట్టి అమ్మాయిలు..మీరు చేసుకోబోయే వ్యక్తిలో ఈ లక్షణాలు లేకుండా జాగ్రత్త పడండి.