Vidura neeti: మహాభారతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విదురుడు. ఆయన చెప్పిన నీతి, నియమాలను పాటించడం వల్ల జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. అలాగే జీవితాన్ని సంతోషంగా గడపాలంటే.. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో విదురుడు బోధిస్తుంది.
చాలా మంది వ్యక్తులు ఎదుటివారి విజయాన్ని చూసి అసూయపడతారు. ఇది సాధారణ మానవ ప్రవర్తన. అలాంటి వారు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, జీవితంలో నెగటివిటీని నింపుతారు. మీ ప్రగతికి, ప్రశాంతతకు అడ్డంకులుగా మారుతారని, అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిదని విదురుడు వివరించారు.
26
వారి దూరంగా ఉండండి
ఇతరులపై అసూయపడేవారు ఎల్లప్పుడూ నెగటివిటీని వ్యాప్తి చేస్తారు. వారు తమ మాటలు, ఆలోచనలు, ప్రవర్తనతో ఎవరినైనా తక్కువ చేసి చూస్తారు. ఇతరులపై విమర్శలు గుప్పిస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలు.
36
మానసిక ప్రశాంతతకు భంగం
ఎవరైనా మీ విజయం లేదా ఆనందం చూసి ఈర్ష పడుతున్నారంటే.. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా మీ ఆనందాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు. వారి గాసిప్స్, వ్యంగ్య మాటలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. దీంతో మీరు ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు.
మిమ్ములను చూసి అసూయపడేవారు మీ విజయానికి, ప్రగతికి అడ్డంకులుగా మారుతారు. వారు విమర్శలు, అవమానాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ కించపరిచే ప్రయత్నం చేశారు.
56
వారిని నమ్మకండి
మీ విజయాన్ని, పురోగతిని చూసి ఈర్ష పడేవారు మీ నాశనాన్ని కోరుకుంటారు. మిమ్ములను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారు ఇచ్చే సలహాలను అస్సలు పాటించకండి. వారిని నమ్మకండి.
66
ఇవి పాటించండి
మీపై అసూయపడేవారిని గుర్తించి దూరంగా ఉండండి. వారి మాటలను పట్టించుకోకండి. సానుకూల, ప్రగతిశీల వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి.