ప్రతి తండ్రి తన పిల్లలను అపురూపంగా చూసుకుంటాడు. కష్టాలన్నీ తాను పడి.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంటాడు. అలాంటి తండ్రుల త్యాగాలకు గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకుంటాము. మరి ఈ ఫాదర్స్ డే నాడు నాన్నపై మీకున్న లవ్ ని ఇలా చెప్పండి.
Father's Day Wishes & Quotes: మనందరికీ మొదటి హీరో నాన్నే. నాన్న ఎప్పుడూ మనపై కోపం చూపించినా, మనతో కఠినంగా ప్రవర్తించినా అది మన మంచి కోసమే. మనకు మంచి జీవితం ఇవ్వాలనే. పిల్లల కోసం నిత్యం కష్టపడే వ్యక్తి నాన్న. కష్టాలన్నీ తాను అనుభవించి.. సుఖాలను మాత్రమే పిల్లలకు ఇవ్వాలి అనుకుంటాడు నాన్న. అలాంటి నాన్నల త్యాగాలను గుర్తుంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా నాన్నల దినోత్సవం జరుపుకుంటారు.
27
జూన్ 3వ ఆదివారం
ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా నాన్నల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాన్నల దినోత్సవం రేపు(జూన్ 15 ఆదివారం) వస్తుంది. మన జీవితానికి మార్గదర్శకుడైన నాన్నను ఆనందపరిచే కొన్ని కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. వాటితో నాన్నలను విష్ చేయండి. వారు చాలా సంతోషిస్తారు.
37
నాన్నకు ప్రేమతో..
1. నాన్న.. నా జీవితానికి మీరే మార్గదర్శి. మీరే నా సూపర్ హీరో.. నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు నాన్న.
2. నాన్న… నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు! మీ ప్రేమకు, మార్గదర్శకత్వానికి నా ధన్యవాదాలు.