Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే అబ్బాయిలకు కోపిష్టి భార్యలు వస్తారు!

Published : Jun 08, 2025, 01:54 PM IST

ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు తన ఆలోచన శక్తిని కోల్పోతాడు. కోపం కారణంగా చాలాసార్లు భార్యా భర్తల బంధం కూడా దెబ్బతింటుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలకు.. కోపిష్టి భార్యలు వస్తారట. ఆ అక్షరాలేంటో ఓసారి చూద్దామా.. 

PREV
16
ఈ అక్షరాలతో పేర్లుంటే భార్యతో జాగ్రత్త!
ఏ అబ్బాయిలకు కోపిష్టి భార్యలు వస్తారు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు కోపిష్టిలైతే, మరికొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే పురుషులకు ఎక్కువ కోపం ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలకు కోపిష్టి భార్యలు వస్తారట. మరి ఆ అక్షరాలేంటో.. వాటిలో మీ పేరు మొదటి అక్షరం ఉందో చెక్ చేసుకోండి.

K అక్షరం

K అక్షరంతో మొదలయ్యే పేరున్న పురుషులకు కోపం ఎక్కువగా ఉండే భార్యలు వస్తారట. గొడవలు పెట్టుకోవడంలో వీరు ముందుంటారట. ఈ అక్షరంతో మొదలయ్యే పేరున్న భర్తల భార్యలు ఎవరి మాట వినరట. కానీ వారి భర్తలు.. తాము చెప్పినట్లు వినాలని కోరుకుంటారట.

26
M అక్షరం

ఏ అబ్బాయి పేరు M అక్షరంతో మొదలవుతుందో వారి భార్య కోపం విషయంలో ముందుంటారు. వారు ఎప్పుడూ కోపంగానే ఉంటారు. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటారు. వారిని చూస్తే కోపగించుకోవడానికి ఒక కారణం వెతుకుతున్నట్లు అనిపిస్తుంది.

36
P అక్షరం

P అక్షరంతో పేరు మొదలయ్యే భర్త.. మొండి స్వభావం గల భార్యను పొందుతారు. ఈ మహిళలు ప్రతీది తమకు నచ్చినట్లుగా జరగాలని కోరుకుంటారు. అలా జరగకపోతే వారు కోపగించుకోవడానికి పెద్ద కారణం వెతుక్కుంటారు.

 

46
R అక్షరం

R అక్షరంతో పేరు మొదలయ్యే పురుషులు కోపంగా ఉండే.. తెలివైన జీవిత భాగస్వామిని పొందుతారు. వారికి కావాల్సిన పని చేయించుకోవడానికి కూడా ఈ భార్యలు కోపాన్నే ప్రదర్శిస్తారు. ఏ పనినైనా కోపంతో సాధిస్తారు.

56
Y అక్షరంతో..

సాధారణంగా ఏ అబ్బాయి పేరు Y తో మొదలవుతుందో... వారి భార్య కోపం చాలా ప్రమాదకరం. వీరు చాలా డ్రామాలు చేస్తారు. వారి కోపం గురించి అందరికీ తెలుస్తుంది. ఎవరూ వీరి ముందు మాట్లాడేందుకు ధైర్యం చేయరు.

66
ఇది గుర్తుంచుకోండి!

ఒకవేళ మీ భార్య స్వభావం కోపిష్టితనం అయితే... ప్రతి విషయంలో మీరు చాలా ప్రశాంతంగ ఉండాలి. ఆమెకు కోపం పెరిగితే.. మీరు కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. లేకుంటే పరిస్థితి మరింత దిగజారవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం చెప్పిన ఈ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories