Relationship Tips: భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!

Published : Mar 16, 2026, 06:21 PM IST

పెళ్లి బంధం.. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకోవడంపై నిలబడుతుంది. కానీ ఎంత మంచి దంపతులైనా కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే అవి ఎక్కువ కాలం కొనసాగితే సంబంధంలో దూరం పెరిగే అవకాశం ఉంటుంది. మరి దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. 

PREV
16
భార్యా భర్తల మధ్య గొడవలు తగ్గించే టిప్స్

ఒక ఆడ, మగ కలిసి చేసే అందమైన ప్రయాణమే పెళ్లి. అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. లైఫ్ స్టైల్, పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి అనేక కారణాల వల్ల కొన్నిసార్లు గొడవలు జరుగుతుంటాయి. కానీ ఆ గొడవలు ఎక్కువ కాలం కొనసాగితే దంపతుల మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే సంబంధాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా కొనసాగించాలంటే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం తప్పనిసరి అవేంటో చూద్దాం.

26
ఒకరి మాట మరొకరు శ్రద్ధగా వినడం

చాలా సందర్భాల్లో గొడవలు పెరగడానికి ప్రధాన కారణం ఒకరి మాట మరొకరు వినకపోవడం. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు పూర్తిగా వినకుండా వెంటనే స్పందించడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామి ఏం చెబుతున్నారో శాంతంగా వినడం చాలా అవసరం. వారు చెప్పే భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుకోవడం, కోపంగా స్పందించడం వంటివి తగ్గించుకుంటే గొడవలు తగ్గిపోతాయి.

36
పరస్పర గౌరవం

భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అంతే ముఖ్యం. ఒకరిని మరొకరు చిన్నచూపు చూడటం, ఇతరుల ముందు అవమానించడం, తక్కువ చేసి మాట్లాడడం వంటి విషయాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. దంపతులు ఒకరినొకరు గౌరవంగా చూడటం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వల్ల సంబంధం బలపడుతుంది. గౌరవం ఉన్న చోట గొడవలు వచ్చినా అవి ఎక్కువ కాలం కొనసాగవు.

46
కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకపోవడం

చాలా గొడవలు కోపం వల్లే పెద్ద సమస్యలుగా మారుతాయి. చిన్న విషయం కూడా ఆ సమయంలో పెద్దగా కనిపిస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగి ఆలోచించడం మంచిది. వెంటనే కఠినమైన మాటలు మాట్లాడితే ఎదుటి వ్యక్తి మనసు గాయపడే ప్రమాదం ఉంటుంది. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా మాట్లాడితే సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ అలవాటు దంపతుల మధ్య అనవసర గొడవలను తగ్గించడంలో సహాయపడుతుంది.

56
కలిసి సమయం గడపడం

ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. రోజులో కొద్దిసేపైనా కలిసి మాట్లాడుకోవడం, వాకింగ్ కి వెళ్లడం, కలిసి భోజనం చేయడం వంటి చిన్న అలవాట్లు సంబంధాన్ని బలంగా ఉంచుతాయి. కలిసి గడిపే సమయం పెరిగితే ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

66
చిన్న విషయాలను పెద్దగా చేయకపోవడం

ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. కానీ వాటిని పెద్దగా తీసుకొని రోజుల తరబడి గొడవపడితే సంబంధం బలహీనపడుతుంది. కొన్ని విషయాలను పట్టించుకోకుండా వదిలేయడం కూడా అవసరమే. ఎప్పుడూ గెలవాలనే భావనతో కాకుండా సంబంధం నిలబడాలని ఆలోచిస్తే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం కూడా దాంపత్య జీవితంలో చాలా ముఖ్యమైన లక్షణం.

Read more Photos on
click me!

Recommended Stories