ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను బోధించాడు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం గురించి. చాణక్యుడి ప్రకారం కొందరు అబ్బాయిలు.. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదట. ఎందుకో చూద్దాం.
అందమైన అమ్మాయి భార్యగా రావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. కానీ అందమైన యువతిని పెళ్లి చేసుకోవడం అందరికీ మంచిది కాదంటాడు చాణక్యుడు. కొంతమంది జీవితాల్లోకి అందమైన అమ్మాయి వస్తే.. ఆమె అందం అతని జీవితాన్ని నరకం కంటే దారుణంగా చేస్తుందట. చాణక్యుడి ప్రకారం ఎలాంటి అబ్బాయిలు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదో ఇక్కడ చూద్దాం.
26
ఆర్థిక పరిస్థితి..
"సుందరీ భార్య దరిద్రుడి ఇంటికి వెళ్తే, ఆమె విషం లాంటిది" అని చాణక్యుడు అన్నారు. భర్త ఆర్థికంగా బలహీనంగా ఉండి.. భార్య అందంగా ఉంటే, అతనిలో అభద్రతా భావం పెరుగుతుందని చాణక్య నీతి చెబుతోంది. అభద్రతా భావం సంబంధాన్ని విషపూరితం చేస్తుంది. అలాంటి సంబంధాల్లో చాలాసార్లు బయటి వ్యక్తులు వీరిని తప్పుడు ఉద్దేశంతో చూస్తారు. దానివల్ల భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత, అపనమ్మకం పెరుగుతాయి.
36
నియంత్రణ లేని వ్యక్తులు..
చాణక్యుడి ప్రకారం.. తమ కళ్లను నియంత్రించుకోలేని వారికి అందమైన స్త్రీ ప్రమాదకరం. ఎందుకంటే ఆమె వారిలో గందరగోళం, ఒత్తిడికి కారణం కావచ్చు. అతను ఆమెను ఆస్తిగా చూస్తాడు. సంబంధ గౌరవాన్ని అర్థం చేసుకోడు.
చాణక్యుడి ప్రకారం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని వ్యక్తి అమ్మాయి అందం చూసి పెళ్లి చేసుకుంటే.. అతను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందమైన భార్య అతని బలహీనత కావచ్చు.
56
అసూయ కలిగినవారు..
తమ భార్యలను ఆస్తిగా భావించే పురుషులు.. తమ అందమైన భార్యల స్వేచ్ఛ, ప్రజాదరణ గురించి అసూయపడతారు. ఈ అసూయ సంబంధాన్ని విషపూరితం చేస్తుంది.
66
అనుమానించే వ్యక్తులు
అన్నీంటిని అనుమానించే పురుషులకు.. అందమైన భార్య కఠిన పరీక్ష అవుతుందని చాణక్యుడు పేర్కొన్నాడు. అనుమానించే గుణం వల్ల వారు కారణం లేకుండా మానసిక వేదన అనుభవిస్తారు.