ప్రతి విషయంలో ముందుగా మీరు పాజిటివ్ గా ఉండాలి. మీలో పాజిటివిటీ ఉంటే... వారిలో కూడా ఆ పాజిటివిటీ పెరుగుతుంది. మార్కులు తక్కువగా వచ్చాయని తిట్టడం లాంటివి చేయకూడదు. మరోసారి తెచ్చుకోవచ్చు... ఏం పర్వాలేదని చెప్పాలి.
ఏదైనా తాము సాధించలేకపోతే ఇంట్లో పేరెంట్స్ పనిష్ చేస్తారు అనే భయం వారిలో ఉండకూడదు. అలాంటి భయం ఉంటే... వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గుతతాయి. కాబట్టి.. వారిని పనిష్ చేయకుండా.. ప్రేమతో వారు మరింత ముందుకు సాగేలా ప్రోత్సహించాలి.