చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు ఏం చేసినా అరిచేస్తూ ఉంటారు అయితే.. పేరెంట్స్ అలా అవరడం వల్ల.. పిల్లలు చాలా బాధపడతారు. పేరెంట్స్ కూడా... అరిచిన తర్వాత.. అనవసరంగా అరిచామని, అరవకుండా ఉంటే బాగుండేది అని ఫీలౌతూ ఉంటారు. అసలు.. ముందే అరవకుండా ఉండాలంటే ఈ కింది పనులు చేయండి.
26
1.పిల్లల మీద అరవాలని లేకపోయినా, వాళ్లు చేసే పనులకు అరవకుండా ఉండలేము అని చాలా మంది అనుకుంటారు. అయితే.. పిల్లలను అరవాల్సి వచ్చినప్పుడు మీరు ఒక్క నిమిషం ఆగి.. 1 నుంచి 10 వరకు నెంబర్స్ లెక్క పెట్టండి. సరిపోదు అనుకుంటే 100 వరకు లెక్కపెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు కూడా కొంచెం కోపం తగ్గుతుంది. దీని వల్ల మీరు పిల్లలపై అరవకుండా ఉంటారు.
36
2.మీరు పిల్లలపై కోపంగా అరవడం వల్ల.. వారి మనసు చాలా గాయపడుతుంది. అలా అని పిల్లలు తప్పు చేసినా చూస్తూ ఉరుకోలేం కదా. అయితే.. అలా ప్రతిసారీ పిల్లలపై అరవకుండి. అరవడానికి బదులు.. వారికి నెమ్మదిగా చెప్పండి. పిల్లలు కూడా మీరు అలా నెమ్మదిగా చెప్పడం తో ఆశ్చర్యపోతారు.
46
3.మీరు మీ పిల్లల నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని వారికి సరిగ్గా కన్వే చేయాలి. మీర వారికి సరిగా చెబితే.. వారు మీరు చెప్పినట్లే వినే అవకాశం ఉంది. పిల్లలతో కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి. దాని వల్ల మీరు పిల్లలపై అరవాల్సిన అవసరం ఉండదు.
56
4. ఎప్పుడూ పిల్లల్లో తప్పులు వెతుకుతూ కూర్చుంటే.. వాళ్లు ఏది చేసినా మనకు అరవాలనే అనిపిస్తుంది. అలా కాకుండా.. ముందు మీరు పిల్లల్లో పాజిటివ్ యాంగిల్ చూడటం అలవాటు చేసుకోవాలి. వాళ్లల్లో పాజిటివ్ యాంగిల్ చూడటం మొదలుపెడితే.. మీరు వారిపై ఎక్కువగా అరవాల్సిన అవసరం ఉండదు.
66
5.పిల్లలను ఎక్కువగా ఫిజికల్ యాక్టివ్స్ లో ఎంగేజ్ చేస్తూ ఉండాలి. వారితో కలిసి మీరు కూడా వారు ఆడే గేమ్స్ ని ఎంజాయ్ చేయాలి. ఇలా మీరు పిల్లలతో కలిసి ఆడటం వల్ల.. వారు ఎక్కువగా అల్లరి చేసే అవకాశం ఉండదు. మీరు కూడా వారిపై అరిచే అవసరం రాదు.