చాలా మంది తల్లులు పిల్లలకు ఒక ఏడాది వయసు రాగానే తల్లిపాలను ఇవ్వడం ఆపేస్తుంటారు. అలాగే పిల్లలకు ఎనిమిది, తొమ్మిది నెలల వయసు నుంచే పాలతో పాటుగా ఇతర ఆహారాలను కూడా తినిపిస్తుంటారు. కానీ చిన్న పిల్లలకు ఏవి పడితే అవి తినిపించకూడదు. ఎందుకంటే ఇవి పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మరి సంవత్సరం వయసున్న పిల్లలకు ఎలాంటి ఆహారాలను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
feeding children
చాలా మంది తల్లులు పిల్లల కోసం సపరేట్ గా మిక్సీలో వేసి ఫుడ్ ను గ్రైండ్ చేసి పెడుతుంటారు. కానీ ఇలా పిల్లలకు పెట్టకండి. మీకోసం వండుకున్న ఆహారాన్నే తీసుకుని బాగా మెత్తగా చేసి పిల్లలకు పెట్టండి. ఒక సంవత్సరం నిండక ముందే పిల్లలకి మసాలా, ఉప్పుగా ఉండే ఆహారాలను ఎక్కువగా పెట్టకండి. ఇది మీ బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
feeding baby
మీ బిడ్డ కోసం స్పెషల్ గా వండటం మానుకోండి. అలాగే ఫ్యామిలీ కోసం వండిని దాంట్లో నుంచే పెట్టండి. ముఖ్యంగా ఒక సంవత్సరం వయస్సు తర్వాత పిల్లలు సొంతంగా తినేలా ప్రోత్సహించడం చాలా అవసరం. ఏడాది పిల్లలకు పూర్తిగా హోం మేడ్ ఫుడ్ నే పెట్టాలి. మీరు మీ పాప కోసం స్పెసల్ గా ఫుడ్ ను వండి పెట్టాల్సిన అవసరం లేదు.
సాధారణంగా ఉదయం ఇడ్లీ, దోషతో మొదలుపెట్టి మధ్యాహ్నం కుటుంబమంతా తినే ఫుడ్, రాత్రి పప్పు, చపాతీని పిల్లలకు ఇవ్వండి. ఒక సంవత్సరం వయస్సు తర్వాత పిల్లలు అన్ని రకాల ఆహారాలను జీర్ణం చేసుకుంటారు. పిల్లలకు పళ్లు లేకపోయినా ఫుడ్ బాగా తినొచ్చు.
అయితే పిల్లలకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తల్లిపాలు ఇవ్వొచ్చు. అందుకే సంవత్సరం రాగానే పాలను ఇవ్వడం మానేయకండి. ఏడాది వయసు దాటిన తర్వాత బిడ్డకు లభించే శక్తిలో 40 శాతం తల్లిపాల ద్వారా లభిస్తుంది. మీరు పనిచేసే తల్లులైనా సరే పాలను ఖచ్చితంగా ఇవ్వండి.
ఒక సంవత్సరం పైబడిన పిల్లలకు రోజుకు మూడు పూటలా భోజనం పెట్టాలి. పండ్లను కూడా తినిపించొచ్చు. అలాగే రోజుకు రెండు సార్లు తల్లిపాలు ఇవ్వాలి. గొంతులో ఇరుక్కునే ఆహారాలను ఇవ్వకూడదు. పిల్లలకు 100 మిల్లీ లీటర్ల ఆవు పాలను కూడా పిల్లలకు తాగించొచ్చు.
kids health
పిల్లలకు స్వీట్లు, చిప్స్ వంటివి ఇవ్వకూడదు. ఒకవేళ మీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే మాత్రం ఇంట్లో వండిన ఆహారాలను మాత్రం తినరు. మీ పిల్లల దృష్టి మార్చి వారికి ఇంట్లో వండిన ఫుడ్ పెట్టండి. సెల్ ఫోన్ లో పాటలు, రైమ్స్ ప్లే చేసి పిల్లలకు చూపిస్తూ తినిపించకండి. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. అలాగే పిల్లలు తినేటప్పుడు అందరి పక్కన కూర్చోబెట్టండి. పిల్లలకు ఒంటరిగా తినిపిస్తే..వారికి మంచి ఫుడ్ పెట్టలేదని అనుకోవచ్చు.