మీ పిల్లలు చదివింది మర్చిపోకూడదంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Aug 14, 2024, 10:07 AM IST

కొంతమంది ఒక్కసారి చదివినా ఎన్నో రోజుల వరకు గుర్తుంచుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం పది సార్లు చదివినా.. ఆ విషయాన్ని వెంటనే మర్చిపోతుంటారు. అయితే ఇలాంటి పిల్లలకు కొన్ని రకాల ఫుడ్స్ ను పెడితే మతిమరుపుకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. 
 

memory power in children

పిల్లలు చదువులో ముందుండాలన్నా, బయటి విషయాల పట్ల అవగాహన ఉండాలన్నా..  చదివింది పక్కాగా గుర్తుండాలి.  అయితే కొంతమంది పిల్లలు మాత్రం ఒక్కసారి చదివితే దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ అందరు పిల్లలు ఇలా ఉండరు. కానీ తరచుగా మర్చిపోయే అలవాటు పిల్లల్ని చదువులో వెనకబడేయడమే కాకుండా.. హేలనకు కూడా గురిచేస్తుంది. అయితే కొన్ని రకాల ఫుడ్స్ పిల్లల మెమోరీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడతాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. దాని పనితీరును పెరుగుపరుస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. మరి మెమోరీ పవర్ పెరగడానికి పిల్లలు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఆయిలీ ఫిష్

కొవ్వు చేపలు మెదడు పనితీరును మెరుగుపర్చడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఈ ఆయిల్ ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి మెదడు నిర్మాణం, పనితీరు మెరుగ్గా ఉండటానికి ఎంతో అవసరం. ఆయిలీ ఫిష్ ను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలు ఒక విషయాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా మెరుగుపడుతుంది.
 

Latest Videos


హోల్ గ్రెయిన్స్

హోల్ గ్రెయిన్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అంటే మధుమేహులు వీటిని రోజూ తినొచ్చు. అంతేకాదు వీటిని తింటే  మన మెదడుకు నిరంతర శక్తి అందుతుంది. ఇది అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. 
 

బెర్రీలు

బెర్రీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తింటే బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే బ్రెయిన్ సెల్ కమ్యూనికేషన్‌ మెరుగుపడుతుంది. అలాగే బెర్రీలు అభ్యాసం, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. 
 

ఆకు కూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి. ఈ ఆకు కూరలు మన మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. వీటిలో మెదడును ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,  మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు ఉన్నవారు ఈ ఆకు కూరలను తింటే మంచి ఫలితం ఉంటుంది. 
 

నట్స్, విత్తనాలు

నట్స్, గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని తింటే మర్చిపోయాను అనే మాట చాలా వరకు తగ్గుతుందిజ వీటిలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. 
 

కాఫీ

కాఫీ కూడా మెదడు పనితీరును మెరుగుపర్చడానికి, మెమోరీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. కాఫీలో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాఫీని తాగితే మీరు వెంటనే చురుగ్గా మారుతారు. అలాగే మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 

click me!